ఏఐ బుడగ పేలుతోందా? ఒక్కరోజే రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి!

మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద సాంకేతిక విప్లవంగా భావించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్ర భయాందోళనలోకి నెట్టివేస్తోంది. ఏఐ ఆధారితప్రాజెక్టులు, ఉత్పత్తులలో దిగ్గజ సాంకేతిక సంస్థలు వేల బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ.. వాటి నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. ఏఐ రంగంలో ఊహించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ ఆధారిత షేర్ల భారీ అమ్మకాలు మొదలై.. అమెరికా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

భారత్‌లోకి గూగుల్ కొత్త ఏఐ యాప్.. మీ జీవితాన్నే కథలా చూపించే అద్భుత ఫీచర్!
భారత్‌లోకి గూగుల్ కొత్త ఏఐ యాప్.. మీ జీవితాన్నే కథలా చూపించే అద్భుత ఫీచర్!

ఒక్కరోజే ఊడ్చిపెట్టుకుపోయిన 2.5 ట్రిలియన్ డాలర్లు!
అమెరికా షేర్ మార్కెట్లో ఏఐ టెక్నాలజీ షేర్ల సూచీ అయిన 'నాస్‌డాక్ 100' గురువారం ఒక్కరోజే ఏకంగా 6 శాతం పతనమైంది. మార్చి 2020 తర్వాత ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇది. అమెరికా మార్కెట్లో గురువారం ఒక్కరోజే 2.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోగా.. అందులో దాదాపు ట్రిలియన్ డాలర్లు కేవలం ఏఐ ఆధారిత టెక్ దిగ్గజాలదే కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ, ఎన్‌విడియా, మెటా వంటి సంస్థల షేర్లు 25 శాతం వరకు పడిపోయాయి.

Is the AI Bubble Bursting 2 5 Dollars Trillion Wiped Out as Tech Stocks Crash Globally Full Details Here

ఊగిసలాడుతున్న చైనా, దక్షిణ కొరియా
ఏఐ మోడళ్లను శిక్షణ ఇవ్వడానికి, డేటా సెంటర్లు, చిప్స్ తయారీకి వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా రెవెన్యూ జెనరేట్ చేసే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏ కంపెనీ దగ్గర లేకపోవడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఏఐ హార్డ్‌వేర్, సెమీకండక్టర్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనాలోని స్టార్టప్స్, షేర్ మార్కెట్లు కూడా గత కొన్ని రోజులుగా పతన బాటలో పడ్డాయి. ఏఐ ఆధారిత చిప్స్ సప్లైకి ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ కొరియా మార్కెట్లో గురువారం అమ్మకాల ఒత్తిడి కారణంగా ఏకంగా 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌‌ను నిలిపివేయాల్సి వచ్చింది. శామ్‌సంగ్, ఎస్కే హైనిక్స్ వంటి సంస్థల షేర్లు విపరీతంగా క్షీణించాయి.

తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ
తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ

భారత్‌పై పడే ప్రభావం ఎంత?
సాఫ్ట్‌వేర్ డెవల‌ప్మెంట్, బిజనెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్(బీపీవో) సేవల కేంద్రంగా ఉన్న భారత్, ఫిలిప్పీన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఐటీ సేవల రంగానికి ఇది తాత్కాలిక సవాలుగా మారే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఏఐ ప్రాజెక్టులు ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఇవ్వకపోతే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రమైన మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+