తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ

తెలంగాణా రాష్ట్రంలో యువతకు శుభవార్త. ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.

'తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్' పేరుతో ఈ కార్యక్రమం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తుంది. తాజాగా రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య ఒప్పందం కుదిరింది.

Free AI and Cloud Computing Training for One Lakh Students in Telangana TASK-AWS Partnership Announced

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన అంశాల్లో శిక్షణ పొందుతారు. ప్రత్యేకంగా ప్రాక్టికల్ అనుభవం కోసం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ వంటి నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు.

దీనివల్ల సాంకేతికేతర విభాగాల విద్యార్థులు కూడా ఆధునిక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా 900కు పైగా డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షలకు డిస్కౌంట్ వోచర్లు కూడా అందిస్తారు. సాంకేతిక నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు, హ్యాకథాన్లు నిర్వహించి విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కల్పిస్తారు.

శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అధ్యాపకులకు కూడా ప్రపంచస్థాయి ఏఐ, క్లౌడ్ సాంకేతిక శిక్షణ ఇస్తారు.ఈ కార్యక్రమం ప్రభుత్వం, కళాశాలలు లేదా విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం వేయకుండా నడుస్తుంది. తెలంగాణను ఏఐ, ఐటీ రంగంలో ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ స్కిల్లింగ్ కార్యక్రమాలు చేపడుతోంది.

విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పింఛనుదారులందరికీ దీపావళికి.. పండుగ చేసుకునే వార్త!
విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పింఛనుదారులందరికీ దీపావళికి.. పండుగ చేసుకునే వార్త!

గతంలో టాస్క్ ఇతర సంస్థలతో కలిసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏఐ, క్లౌడ్ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను మార్చేస్తున్న క్రమంలో ఈ శిక్షణ ద్వారా తెలంగాణ యువత ప్రపంచస్థాయి నైపుణ్యాలు సంపాదించటం కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ప్రస్తుత యువతకు నిజంగా సంతోషం కలిగించే, ఉపాధి చూపించే వార్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+