భారత్‌లోకి గూగుల్ కొత్త ఏఐ యాప్.. మీ జీవితాన్నే కథలా చూపించే అద్భుత ఫీచర్!

దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తన ప్రయోగాత్మక పర్సనల్ ఇంటెలిజెన్స్ యాప్ 'డ్రీమ్‌బీన్స్'ను భారత మార్కెట్లో అధికారికంగా ప్రారంభించింది. గూగుల్ ల్యాబ్స్ విభాగం రూపొందించిన ఈ ఏఐ ఆధారిత యాప్ వినియోగదారుల రోజువారీ డిజిటల్ డేటా ఆధారంగా పర్సనల్ విజువల్ కథనాలను సిద్ధం చేస్తుంది. అమెరికాలో మొదలైన ఈ ప్రాజెక్టు విదేశీ మార్కెట్లలో తొలిసారిగా భారత్‌లోనే అడుగుపెట్టడం విశేషం.

తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ
తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ

వాటర్ కలర్ ఇమేజరీ.. విజువల్ డైరీ!
ఈ యాప్ వినియోగదారుల గూగుల్ అకౌంట్‌తో అనుసంధానించబడిన ఫోటోస్, ఈమెయిల్, క్యాలెండర్, ఇతర అప్లికేషన్ల సమాచారాన్ని సేకరిస్తుంది. రోజువారీ ఘటనలు, ప్రయాణాలు, జ్ఞాపకాలను విశ్లేషించి ప్రతిరోజూ ఉదయం వాటర్ కలర్ శైలిలోని డిజిటల్ చిత్రాలతో కూడిన ఆకర్షణీయమైన కథనాల సమాహారాన్ని స్వయంచాలకంగా రూపొందిస్తుంది. ఓ రకంగా ఇది వినియోగదారుడి వ్యక్తిగత జీవితానికి ప్రతిరూపంగా నిలిచే 'డిజిటల్ విజువల్ జర్నల్'గా పనిచేస్తుంది.

Google Dreambeans AI App Launches in India AI-Powered Personalised Visual Stories Available in 14 languages

తెలుగు సహా 14 భాషల్లో లభ్యం
భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లపై విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 14 భాషల మద్దతుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రాంతీయ భాషల్లో తమ రోజువారీ విశేషాలను కథనాల రూపంలో చూసుకునే వెసులుబాటు వినియోగదారులకు లభించనుంది.

న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ: టీమిండియాతో మొదటి వన్డే నుంచి స్టార్ బ్యాటర్ అవుట్
న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ: టీమిండియాతో మొదటి వన్డే నుంచి స్టార్ బ్యాటర్ అవుట్

డేటా భద్రత.. వినియోగదారులకే పూర్తి కంట్రోల్
డేటా ప్రైవసీ విషయంలో గూగుల్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. వినియోగదారుల అనుమతించిన గూగుల్ యాప్స్ నుంచి మాత్రమే డ్రీమ్‌బీన్స్ డేటాను స్వీకరించింది. ఒకవేళ ఏదైనా అప్లికేషన్‌ను లింక్ చేయకపోతే ఆ సమాచారాన్ని కథనాల్లో చేర్చదు. ఏ డేటాను షేర్ చేయాలి, వేటిని మినహాయించాలి అనే పూర్తి నియంత్రణ వినియోగదారుల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా కానే కాదు!
డ్రీమ్‌బీన్స్ యాప్ సాధారణ సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటిది కాదని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి లేదా పోస్టులను బహిరంగంగా పంచుకోవడానికి ఎలాంటి ఫీచర్లు ఉండవు. వినియోగదారుల కంటెంట్‌ను ఇతరులకు ప్రదర్శించే ఆలోచన ఉందో లేదో కూడా గూగుల్ ఇంకా వెల్లడించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో జెమిని, ఏఐ మోడ్ సేవలను విస్తరిస్తూ పర్సనల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో తన పట్టును బలపరచుకోవడానికి గూగుల్ ఈ అడుగు వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+