జియో బంపర్ ఆఫర్: రూ.399 రీఛార్జీతో రూ.3300 క్యాష్‌బ్యాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో మరో ఆఫర్‌ను ప్రకటించింది. న్యూఇయర్ ఆఫర్‌ను ప్రకటించిన రెండు రోజులకే సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ముందుకు తీసుకువచ్చింది. క్యాష్ బ్యాక్ ను ఈ ఆఫర్‌ కింద ప్రకటించనుంది రూ.399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జీ చేస్తే రూ.3300 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

న్యూ ఇయర్ ప్లాన్స్: జియో, వొడాఫోన్ పోటా పోటీ ఆఫర్లివే

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనాలను సృష్టించింది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ప్లాన్లతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది.

రిలయన్స్ దెబ్బ: 15 నెలల్లోనే 16 కోట్ల సబ్ స్రైబర్లకు చేరుకొన్న జియో

రిలయన్స్ పోటీని తట్టుకొనేందుకు గాను ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రిలయన్స్ తరహలోనే ఇతర టెలికం కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ జియో ప్రకటించిన న్యూఇయర్ ప్లాన్‌కు పోటీగా రెండు ఆఫర్లను తెచ్చింది.దీంతో జియో మరో ఆఫర్‌ను ప్రకటించింది.

సర్‌ప్రైజ్ ప్లాన్ ప్రకటించిన జియో

సర్‌ప్రైజ్ ప్లాన్ ప్రకటించిన జియో

రిలయన్స్ జియో సర్‌ప్రైజ్ ప్లాన్‌ను ప్రకటించింది. న్యూఇయర్ ప్లాన్‌ను ప్రకటించిన రెండు రోజులకే కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.399 లేదా అంతకంటే ఎక్కువ రీ ఛార్జీ చేసుకొన్న వారికి రూ.3300 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.అయితే ఈ ఆఫర్‌పై ఇతర టెలికం కంపెనీలు ఏ తరహలో స్పందిస్తాయో చూడాలి.

క్యాష్ బ్యాక్ వర్తించాలంటే ఇలా చేయాలి

క్యాష్ బ్యాక్ వర్తించాలంటే ఇలా చేయాలి

రూ.3300 క్యాష్‌బ్యాక్ వర్తించాలంటే 2018 జనవరి 15 లోపుగా రీ ఛార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది. జనవరి 15 లోపుగా రీఛార్జీ చేసుకొంటేనే సర్‌ప్రైజ్ క్యాష్ బ్యాక్ వర్తించనున్నట్టు ప్రకటించింది. రూ.399 అంతకంటే ఎక్కువ రీ ఛార్జీ చేసుకొంటే రూ.2599 క్యాష్ బ్యాక్ ఆఫర్ డిసెంబర్ 25వ, తేదితో ముగిసింది.దీంతో కొత్త ఆఫర్‌ను జియో ప్రకటించింది.

  Jio Dhan Dhana Dhan New Offer : 100% Cashback on 399 Plan | Oneindia Telugu
  క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇలా పొందాలి

  క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇలా పొందాలి

  రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.3,300 వరకు జియో సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.400 మై జియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్ల రూపంలో ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

  డిసెంబర్ 26 నుండి జనవరి 15 వరకే

  డిసెంబర్ 26 నుండి జనవరి 15 వరకే

  డిసెంబర్ 26 నుండి జనవరి 15 వరకే ఈ ఆఫర్ ఉంటుందని రిలయన్స్ జియో ప్రకటించింది.రూ.399 కంటే ఎక్కువ రీ ఛార్జీ చేసుకొన్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అయితే జనవరి 15 తర్వాత ఆఫర్ కొనసాగుతోందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. గతంలో కూడ కొన్ని ఆఫర్ల గడువును జియో పొడిగించింది. అదే తరహలో ఈ ఆఫర్‌ను పొడిగిస్తోందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telecom operator Reliance Jio today enhanced the cashback offer to up to Rs 3,300 on mobile recharge of Rs 399 and above for all recharges that will be done till January 15 next year, as per company sources.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి