భారీ ఉపశమనాన్ని కలిగిస్తోన్న బంగారం ధరలు.. రేపెలా ఉంటుంది?
పండుగ సీజన్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ప్రియులు, కొనుగోలుదారులకు ఓ సువర్ణావకాశం లభించింది. దసరా, దీపావళి, ధన్‌తేరాస్ పర్వదినాలతో పాటు పెళ్లిళ్ల ముహూర్తాల కాలం కూడా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో సాధారణంగా ఆభరణాల డిమాండ్ భారీగా పెరిగి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వీటి రేట్లు తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి.
అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వీటి ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు గత రికార్డు గరిష్టాల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రిటైల్ మార్కెట్ ఇండెక్స్ ప్రకారం.. దేశంలో సగటు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నప్పటికీ.. ఈ వారంలో తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్ సెలవు దినం కారణంగా ముగింపు ధర రూ.1,47,724 వద్ద నిలిచింది. అంతకుముందు ట్రేడింగ్‌లో ధరలు నిలకడగా సాగాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,36,750 కాగా, 24 క్యారెట్లకు రూ.1,49,180 గా నమోదైంది. ఢిల్లీ, వడోదరా మార్కెట్ లల్లో స్వల్ప తేడాతో 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.1,49,330 గా రికార్డయింది. చెన్నైలో రేట్ అధికంగా ఉంటోంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు 1,37,750 పలికింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,028, 22 క్యారెట్లు - రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,317
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218












Click it and Unblock the Notifications
