కొంప ముంచుతున్న వెండి.. !!
గత రెండు రోజులుగా భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్‌కు ముందు ఈ రెండింటి ధరలు ఆల్‌టైమ్ గరిష్టం నుంచి గణనీయంగా తగ్గాయి. భారీగా కరెక్షన్స్ కనిపిస్తోన్నాయి. వార్షిక బడ్జెట్ రోజున కూడా వెండి ధరల్లో వచ్చిన హ్యూజ్ క్రాష్ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. మున్ముందు మరింత తగ్గుతుందనే అంచనాలు నెలకొన్నాయి. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో కుప్పకూలిపోవడం అనేది చాలా అరుదు.
బడ్జెట్ సందర్భంగా ఆదివారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ప్రారంభం కాగానే కిలో 2,74,000 లక్షల రూపాయల వద్ద కనిపించింది వెండి ధర. శనివారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్ తో పోల్చుకుంటే కిలో వెండిపై ఏకంగా 26,273 రూపాయల భారీ పతనం నమోదైంది. ఆ తర్వాత కూడా వెండి ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. మరింత తగ్గింది. ఒక దశలో కిలోగ్రాముకు 2,73,500 లక్షల రూపాయలకు దిగజారింంది. శుక్రవారం నాటి భారీ పతనం తర్వాత, ఈరోజు కూడా మార్కెట్‌లో లోయర్ సర్క్యూట్ లోనే ట్రేడింగ్ కొనసాగింది.

MCXలో 10 గ్రాముల బంగారం ధర 1,45,000 లక్షల వద్ద ప్రారంభమైన వెంటనే, దీనికి సంబంధించిన కంపెనీల పెట్టుబడిదారులు అమ్మకాలను మొదలుపెట్టారు. ఫలితంగా హిందుస్థాన్ జింక్, దాని మాతృ సంస్థ వేదాంత షేర్లలో తీవ్ర పతనం నమోదైంది. దీని తర్వాత బంగారం ధర తగ్గుతూ వచ్చింది. 1,38,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఇదే క్రమంలో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వంటి బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీల షేర్లు కూడా సుమారు 10 శాతం మేర క్షీణించాయి. ఈ భారీ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చే కీలక ప్రకటనల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ తర్వాత కూడా పతనం కొనసాగుతుందని భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications