Credit Cards: ఎక్కువ కార్డులు ఉంటే నష్టమేంటి?

ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఉచిత సినిమా టికెట్లు వంటివి క్రెడిట్ కార్డు తీసుకున్న వెంటనే సులభంగా లభించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ ప్రయోజనాలను పొందాలంటే కనీస ఖర్చు (Spend-based criteria) పరిమితులను బ్యాంకులు విధిస్తున్నాయి. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంక్ బుక్‌మైషో ఆఫర్ కావాలంటే గత మూడు నెలల్లో కనీసం రూ.25,000 ఖర్చు చేసి ఉండాలి. ఇక లాంజ్ యాక్సెస్ విషయానికి వస్తే, 2026 జూలై నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు వరుసగా రూ.60,000, రూ.75,000 కనీస ఖర్చు పరిమితులను అమలు చేస్తున్నాయి.

చాలా మంది రివార్డుల కోసం రకరకాల కార్డులు వాడుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖర్చును అనేక కార్డులపై విభజించడం వల్ల ఏ ఒక్క కార్డులోనూ కనీస ఖర్చు పరిమితిని చేరుకోలేము. ఫలితంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ఖరీదైన ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. "కార్డులను పోగుచేసే పాత పద్ధతి ఇప్పుడు పని చేయదు. ఖర్చులు పరిమితులకు ముడిపడి ఉన్నప్పుడు, ఏకీకరణే మేలు" అని బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి పేర్కొన్నారు.

New Credit Card Rules 2026 Spend Limits for Lounge Access Make Card Consolidation the Smart Choice

వ్యూహాత్మక వినియోగమే కీలకం

పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ సూచన ప్రకారం, మన అవసరాలకు సరిపోయే 2 నుంచి 4 కార్డులను ఎంచుకోవడం ఆదర్శవంతం. మీ ఖర్చుల అలవాట్ల ప్రకారం కార్డులను వర్గీకరించుకోవాలి:

  • ట్రావెల్ కార్డ్: ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్ కోసం.
  • షాపింగ్/రోజువారీ కార్డ్: నిత్యావసరాలు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం.
  • హై-వాల్యూ కార్డ్: పెద్ద మొత్తంలో చేసే ఖర్చుల ద్వారా గరిష్ట రివార్డులు పొందేందుకు.

నిర్వహణ సులభం.. లాభం మెండు

తక్కువ కార్డులు ఉంటే కేవలం రివార్డులే కాకుండా, నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. ప్రతి కార్డుకు ఉండే వార్షిక రుసుములు (Annual Fees), రివార్డు పాయింట్ల గడువు, బిల్లింగ్ తేదీలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. మీ ఖర్చులకు సహజంగా సరిపోయే కార్డును ఎంచుకోవడం వల్ల అదనపు ఖర్చు చేయాల్సిన ఒత్తిడి ఉండదు. సేవ్ సేజ్ వ్యవస్థాపకుడు ఆశిష్ లత్ చెప్పినట్లుగా, ప్రయాణానికి ఒకటి, రోజువారీ అవసరాలకు మరొకటి అన్నట్లుగా 2-3 కార్డుల కలయికతోనే నిజమైన ఆప్టిమైజేషన్ సాధ్యమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+