Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ కాదు, ఆ దేశమే గొప్ప: కోట్లలో సంపాదించినా జీరో ట్యాక్స్!

ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ పౌరులకు ఆదాయపు పన్నులో రాయితీలు లేదా మినహాయింపులు ఇస్తుంటాయి. కానీ ఓ యూరోపియన్ దేశం ఏకంగా వ్యక్తిగత ఆదాయపు పన్నును రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం మరేదో కాదండోయ్.. పోలాండ్. పోలాండ్ దేశం తన పౌరుల కోసం ఆదాయపు పన్నును రద్దు చేస్తూ చట్టం తీసుకురావడం ద్వారా ఆ దేశాధ్యక్షుడు తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. ఈ కొత్త చట్టం అమలుతో అక్కడి ప్రజల జేబుల్లో భారీగా డబ్బు మిగలనుంది.

ఎన్నికల వాగ్దానం నెరవేర్చిన పోలాండ్ అధ్యక్షుడు
పోలాండ్ అధ్యక్షుడు కారోల్ నవ్రోకీ (Karol Nawrocki) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ నూతన చట్టాన్ని ఆమోదించారు. ఈ సంస్కరణ ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి కొనుగోలు శక్తిని పెంచడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Poland Removes Personal Income Tax for Families Major Tax Reform 2025

పోలాండ్‌లో జీరో పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ (PIT):
పోలాండ్‌లో 'జీరో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్' విధానం కింద ఈ ఆదాయపు పన్ను రద్దు జరిగింది ఈ చట్టం ప్రకారం, కనీసం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాలకు వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పిల్లల చట్టబద్ధమైన సంరక్షకులకు, పెంపుడు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. గత ఆగస్టులో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు ప్రకారం, ఏడాదికి 140,000 జ్లోటీలు (సుమారు రూ. 33.82 లక్షలు) వరకు సంపాదించే కుటుంబాలు ఇకపై తమ ఆదాయంపై పన్ను చెల్లించనవసరం లేదు.

ప్రజలకు కలిగే ఆర్థిక ప్రయోజనం
అధ్యక్ష కార్యాలయం అంచనా ప్రకారం, ఈ పన్ను మినహాయింపు ద్వారా సగటు పోలిష్ కుటుంబం నెలకు సుమారు 1000 జ్లోటీలు (దాదాపు రూ. 24 వేలు) ఆదా చేసుకోగలుగుతుంది. ఇది వారి జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. అయితే ఈ చట్టం పూర్తి ప్రయోజనం 2026 పన్ను రిటర్నులలో (2027లో ఫైల్ చేసేటప్పుడు) స్పష్టంగా కనిపిస్తుంది.

'ట్యాక్స్ ఆర్మర్' పథకంలో భాగం:
ఈ జీరో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అనేది పోలాండ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ట్యాక్స్ ఆర్మర్' అనే పెద్ద ఆర్థిక సంస్కరణ పథకంలో ఒక భాగం. ఈ పథకంలోవ్యాట్ (VAT) ను 23% నుంచి 22% కి తగ్గించడం, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను రద్దు చేయడం, పెన్షన్ ఇండెక్సేషన్ కోసం ఒక కోటా విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి ఇతర పన్ను సంస్కరణలు కూడా ఉన్నాయి.

ఎన్నికల వాగ్దానం నెరవేర్పు
కుటుంబాలపై పన్ను భారాన్ని తగ్గించడం, ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చూడటం, ప్రజలను మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సహించడం, ఖర్చులను పెంచడం వంటి పెద్ద ప్రయత్నంలో భాగంగా ఈ పన్ను సంస్కరణ చేయబడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా, అధ్యక్షుడు నవ్రోకీ జీరో పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ (PIT) వాగ్దానం చేశారు. జూన్‌లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఆయన ఆగస్టు 8న ఈ బిల్లుపై సంతకం చేసి పోలాండ్ పార్లమెంట్‌కు పంపారు.

లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త చట్టం ద్వారా ధనిక కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఇప్పటికే తక్కువ పన్ను చెల్లిస్తున్నారు కాబట్టి, వారికి నామమాత్రపు ప్రయోజనం మాత్రమే ఉంటుంది. నెలకు 7000 జ్లోటీలు (రూ. 1.69 లక్షలు) సంపాదించే కుటుంబాలకు నెలకు సుమారు 395 జ్లోటీలు (రూ. 9541) ఉపశమనం లభిస్తుంది. అత్యధికంగా నెలకు 12,000 జ్లోటీలు (రూ. 2.90 లక్షలు) సంపాదించే కుటుంబాలు నెలకు 913 జ్లోటీలు (రూ. 22 వేలు) ఆదా చేసుకోగలుగుతారు. అత్యల్ప జాతీయ ఆదాయం ఉన్న కుటుంబాలకు, ఇప్పటికే పన్ను పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి పెద్దగా మార్పు కనిపించదు.

ప్రజల అభిప్రాయం
ఈ నిర్ణయంపై పోలాండ్ ప్రజల అభిప్రాయం అధికంగా సానుకూలంగా ఉంది. సెప్టెంబర్ 11న జరిగిన చర్చల్లో పాల్గొన్న వారిలో 76శాతం మంది ఈ కొత్త చట్టానికి మద్దతు తెలిపారు. కేవలం 16శాతం మంది మాత్రమే దీనిని వ్యతిరేకించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+