9 గంటల సుదీర్ఘ చర్చలు.. ప్రభుత్వంతో ఆర్బీఐ సంధి కుదిరేనా?
ప్రభుత్వంతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మొదలు రాత్రి 7 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆర్బీఐకి సరిపడా మూలధనం.. చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రుణ నిబంధనలు, బలహీన బ్యాంకులపై విధించిన రూల్స్ తదితర అంశాలపై వాడీవేడీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి సంధి దిశగా చర్చలు సాగినట్లు కనిపిస్తోంది.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్లకు కొన్ని చిక్కు ప్రశ్నలు ఎదురయినట్లు సమాచారం. ప్రభుత్వ నామినీలుగా వ్యవహరిస్తున్న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ హెచ్చు స్థాయిలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే స్వతంత్ర సభ్యులైన గురుమూర్తితో పాటు మరికొందరు ఆ రెండు వర్గాలకు సర్ధిచెప్పినట్లు టాక్. ఎన్‌బీఎఫ్‌సీలకు మరికొంత ద్రవ్యలభ్యత కల్పించడం.. బలహీన బ్యాంకులకు రూల్స్ సడలించడం.. చిన్న వ్యాపారులకు రుణ నిబంధనల సరళీకరణ, ఆర్బీఐ అదనపు నిధులను కొంత ప్రభుత్వానికి ఇవ్వడం తదితర అంశాలపై ప్రభుత్వంతో పాటు గురుమూర్తి ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.

సంధి కుదిరేనట్లేనా?
ఆర్బీఐ బోర్డు తాజా భేటీతో ప్రభుత్వంతో సంధి కుదిరినట్లు కనిపిస్తోంది. ఆర్బీఐ కొంత వెనుకడుగు వేయడం అలాంటి సంకేతాలకు ఊతమిస్తోంది. ఆర్బీఐ దగ్గర ఉంచుకోవాల్సిన నిధుల నిల్వలపై నిపుణుల కమిటీతో పాటు పలు కమిటీలను ఏర్పాటు చేయడానికి బోర్డు ఓకే చెప్పింది. అంతేకాదు చిన్న వ్యాపారుల రుణాల పునర్నిర్మాణంపై పరిశీలిస్తామని చెప్పడంతో సంధి కుదిరినట్లేననే టాక్ వినిపిస్తోంది.
బోర్డు సమావేశం సానుకూల వాతావరణంలో జరిగినట్లు చెబుతోంది ఆర్బీఐ. తిరిగి మరో సమావేశం వచ్చే నెల 14న జరగనుంది. అయితే ఏ ప్రతిపాదనలపైనా ఓటింగ్ జరగనప్పటికీ.. బ్యాంకింగ్ నియంత్రణ, సూపర్ విజన్ విభాగాలకు హెడ్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ బోర్డు సమావేశంలో కూలంకషంగా వివరించినట్లు సమాచారం. సీసీబీ (కేపిటల్ కన్జర్వేషన్ బఫర్) కింద ఫైనల్ పార్ట్ 0.625 శాతం అమలు చేసే వ్యవధిని మరో ఏడాది పాటు పొడిగించారు. దీంతో 2020 సంవత్సరం మార్చి 31 వరకు అమలు కానుంది.

ఆర్బీఐ ప్రకటన సారాంశం
బోర్డు మీటింగ్ తర్వాత ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన వివరాలు :
1). 9 లక్షల 69 వేల కోట్ల అదనపు మూలధనం పరిశీలనకై హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు ఆర్బీఐ సిద్దం
2). ఈసీఎఫ్ (ఎకానామిక్ కేపిటల్ ఫ్రేమ్ వర్క్) పరిశీలన కోసం మరో కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పింది ఆర్బీఐ. మెంబర్ షిప్, రూల్స్ తదితర అంశాలపై ప్రభుత్వంతో కలిసి నిర్ణయించేందుకు ఒప్పుకుంది. ఆర్బీఐ దగ్గర మూలధన నిల్వలు ఎంతుండాలనే దానిపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
3). సీఆర్ఆర్ (కనీస మూలధన నిష్పత్తి) 9 శాతానికే పరిమితం చేయాలని నిర్ణయం. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
4). 25 కోట్ల రూపాయల వరకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాల పునర్నిర్మాణానికి వీలు కల్పించే స్కీమ్ కు సంబంధించి పరిశీలించేందకు ఆర్బీఐ సుముఖత.
5). పీసీఎ కిందకు వచ్చే బ్యాంకుల సమస్యల పరిష్కారాల కోసం బీఎఫ్ఎస్ (బోర్డు ఫర్ ఫైనాన్సియల్ సూపర్ విజన్) పరిశీలనకు ఓకే.

నో ప్రాబ్లమ్ : పీయూశ్ గోయెల్
ఆర్బీఐ పతనానికి మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందనే రాహుల్ ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కాంగ్రెస్ హయాంలో ఆర్బీఐ నోరు ఎలా నొక్కారో కొత్తగా చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఆర్బీఐతో జరిగిన మీటింగ్ సవ్యంగా, సాఫీగా జరిగిందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐకి బాధ్యతలున్నాయన్న గోయల్.. అందుకనుగుణంగా చర్చలు జరిపితే అభ్యంతరాలు తలెత్తబోవని తెలిపారు. ఆర్బీఐ నిధుల నిల్వల నుంచి సింగిల్ రూపీ కూడా ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పారు. దీనిపై ఇంతకుముందే క్లారిటీ ఇచ్చామన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications