త్వరలో కొత్త సిరీస్‌లో రూ.100 నోట్లు, ప్రకటించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో కొత్త సిరీస్‌తో రూ.100 నోట్లను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొత్తగా వచ్చే ఈ మహాత్మాగాంధీ నోట్ల సిరీస్‌పై గవర్నర్ శక్తికాంతా దాస్ సంతకం ఉండబోతుందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద నోట్ల మాదిరిగానే కొత్త నోట్ల పరిమాణం ఉంటుందని తెలిపింది.

2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 వంటి కొత్త నోట్లను ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో విడుదల చేసిన రూ.100 నోట్లు యథావిధిగా చలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.












Click it and Unblock the Notifications