పిఎన్బీకి రిజర్వ్ బ్యాంక్ షాక్: మోడీ సొమ్ము ఇక రానట్లే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. దానిపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) స్పందించింది. ఈ కుంభకోణంలో తుడిచిపెట్టుకు పోయిన సొమ్మంతా చెల్లించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ఆదేశించింది.

ఈ కుంభకోణంలో నష్టపోయిన సొమ్మును ఇతర బ్యాంకులకు పిఎన్‌బీయే చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. ఈ సొమ్మును పిఎన్బీ చెల్లించకపోతే పిఎన్బీతో పాటు 30 ఇతర బ్యాంకులు భారీగా నష్టపోతాయని చెప్పినట్లు సమాచారం.

RBI tells PNB to pay entire Rs 11,300 crore to counterparty lenders

నీరవ్ మోడీ కారణంగా తుడిచిపెట్టుకుపోయిన రూ. 11,300 కోట్లు ఇతర బ్యాంకులకు పిఎన్బీ చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే, ఇతర బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించాయని పిఎన్బీ అంటోంది.

ఇదిలావుంటే, కుంభకోణం ప్రధాన సూత్రధారి నీరవ్ మోడీ భారత పౌరుడు కాదనే మాట వినిపిస్తోంది. రూ.11,300 కోట్ల మేరకు ముంచినప్పటికీ నీరవ్ మోడీపై చర్యలు తీసుకునే అవకాశం లేదని అంటన్నారు. ఆయన ప్రపంచంలో ఇష్టారీతిన ప్రయాణిస్తూ ఉంటారని కూడా అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Reserve Bank of India has directed Punjab National Bank to pay the entire Rs 11,300 crore owed to counterparty banks in the alleged fraud involving jeweller Nirav Modi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి