RBI ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం ఆమోదం.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.

సాధారణంగా చిన్న నోట్లు చేతులు మారి త్వరగా నలిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు 100 కోట్ల సంఖ్యలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి ప్రాథమిక సేకరణ దశలో ఉన్నాయని, త్వరలోనే మార్కెట్లో చలామణిలో ఉన్న పేపర్ నోట్లతో పాటు సమాంతరంగా ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఇవి నీటిలో తడిచినా, ఎంత వాడినా పాడవకపోవడం వీటి ప్రత్యేకత. కాగా ఈ నోట్లు 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది
పంటలు, పెట్రోల్‌పై ఊరట: నియంత్రణలోనే ద్రవ్యోల్బణం
దేశంలో సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీసే ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా పడిపోతూ వస్తున్న చిల్లర ధరల సూచీ, అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒత్తిడి, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఆరంభంలో స్వల్పంగా 3.9 శాతానికి పెరిగినప్పటికీ, అది ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి కంటే తక్కువగానే ఉందని వివరించారు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడమే కాకుండా, వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా నిత్యావసరాల ధరలు పెరగకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
సామాన్యుడికి పన్నుల మినహాయింపు.. పెరిగిన కొనుగోలు శక్తి!
మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బులు నిలిచేలా ప్రభుత్వం పన్ను సంస్కరణలు చేపట్టింది. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ప్రాథమికంగా పన్ను మినహాయింపు లభించడంతో ప్రజల వద్ద ఖర్చు పెట్టడానికి నిధులు పెరిగాయి. దీనికి తోడు జీఎస్టీ వ్యవస్థలో 28 శాతం ఉన్న అనేక వస్తువులను 18, 12, 5 శాతాలకు కుదించడంతో పాటు కస్టమ్స్ డ్యూటీలను సరళతరం చేశారు. ఫలితంగా దేశంలో తలసరి వినియోగ వ్యయం గణనీయంగా పెరిగిందని, నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Click it and Unblock the Notifications