ఎన్నడూలేని విధంగా రూ. 71కి చేరిన రూపాయి మారకం: కారణాలివే
ముంబై: రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.
రూపాయి గురువారం సెషన్లో రూ.70.74 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల క్షీణత నమోదు చేసింది.

చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడం రూపాయి క్షీణతకు దారితీస్తోంది.
కాగా, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ మార్కెట్లను ఒడిదుడులకు గురిచేసే అవకాశం ఉంది.
-
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications