పిల్లల కోసం SBI నుంచి కొత్త పథకం.. 5 ఏళ్లు కడితే చాలు.. రూ.45 లక్షలు!
పిల్లల పుట్టుక తల్లిదండ్రుల జీవితంలో ఓ సరికొత్త బాధ్యతను తెస్తుంది. వారి ఉన్నత చదువులు, ఆశయాలు, భవిష్యత్తు కలలను నెరవేర్చడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక లక్ష్యం. ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్ల కోసం అనేక పొదుపు, పట్టుబడి పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులు, వివాహం, భవిష్యత్తు నిధిని ఏర్పాటు చేసేందుకు 'ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్' వంటి పిల్లల ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడంతో పాటు మార్కెట్-లింక్డ్ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చడానికి 'ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్' పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ పథకం ప్రాముఖ్యత ఏమిటంటే.. ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్. ఇది ఒకే సమయంలో ఇన్సూరెన్స్ కవరేజ్, మార్కెట్ ఆధారిత పెట్టుబడి రాబడులను అందిస్తుంది. పాలసీ కాలవ్యవధిలో ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా, కుటుంబానికి వెంటనే ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతుంది. మిగిలిన భవిష్యత్ ప్రీమియంలను ఎస్బీఐ లైఫ్ సంస్థే భరిస్తుంది. పాలసీ ముగిసాక నిర్ణీత ఫండ్ బిడ్డకు అందుతుంది. ఈ పథకం ముఖ్యమైన సౌలభ్యం ఏంటంటే.. తల్లిదండ్రులు సుదీర్ఘ కాలం పాటు కాకుండా కేవలం ఐదేళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఐదేళ్ల పాటు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన అనంతరం ఆ పెట్టుబడిని 15 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు ఫండ్లలో కొనసాగనివ్వవచ్చు.

ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ప్లస్ ఓ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో మీరు చెల్లించే సొమ్ము ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది. దీర్ఘకాలంలో(ఉదాహరణకు 15-20 ఏళ్లు) మార్కెట్ సాధించే వార్షిక వృద్ధి ఆధారంగా ఫండ్ విలువ పెరుగుతుంది. ప్రతి ఏటా దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఐదేళ్ల పాటు జమ చేసి.. 12-15 శాతం వార్షిక మార్కెట్ రాబడి లభిస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.45 లక్షల వరకు భారీ ఫండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ పాలసీలో తల్లిదండ్రుల రిస్క్ పరిమితికి అనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి 10 రకాల ఫండ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం చెల్లింపుల కోసం సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే వంటి విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా లాయల్టీ అడిషన్స్ అందించడం ద్వారా ఫండ్ విలువ కాలక్రమేణా మరింత పెరుగుతుంది. పాలసీ ప్రారంభమైన ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన అనంతరం అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పాక్షికంగా విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది.
ఇది స్థిరమైన వడ్డీ ఇచ్చే సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాదు. మార్కెట్ శాతాన్ని బట్టి చివరి మెచ్యూరిటీ మొత్తం మారతూ ఉంటుంది. అందువల్ల ఐదేళ్లు మాత్రమే కట్టి రూ.45 లక్షలు పొందాలనే లక్ష్యం ఉన్నవారు.. తాము ఎంత ప్రీమియం చెల్లించాలి, ఎంత కాలం ఉంచాలి, ఎంత శాతం మార్కెట్ రాబడి అవసరమో మీ ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ లేదా బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications