మంచి సీజన్ టైమ్ లో బంగారం ధరల్లో ఇన్ స్టంట్ జంప్: వెండిపైనా స్పాట్ లైట్స్

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక అస్థిరత దేశీయంగా బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న ఘర్షణ తీవ్రరూపం దాల్చడం, పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ వాతావరణం రికార్డు స్థాయి ధరలకు కారణమవుతోంది. నేడు దేశీయమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్తతల వేళ.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే విలువైన బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు చూపు సారించడమే దీనికి ప్రధాన కారణం.

సోమవారం నాటితో పోల్చుకుంటే నేడు ఎంసీఎక్స్ లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరలో 761 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. రూ. 1,42,310 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కిలో ధర కూడా రూ. 2,320 పెరిగి రూ. 2,20,984 కి చేరింది. బంగారం ఫ్యూచర్స్ 0.61 శాతం వృద్ధితో రూ. 1,42,890 వద్ద కొనసాగతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 1.25 శాతం మేర పెరిగి కిలో రూ. 2,21,330 ల వద్ద స్థిరపడింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Spotlight on MCX Gold and Silver as the Rates Jumps 24K 22K and 18K as Geopolitical Rise Instantly

ఈ పరిణామాలు బంగారు ఆభరణాల కొనుగోలుదారులపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సాధారణంగా మనదేశంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో పసిడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇటువంటి సమయంలో ధరలు పెరుగుదల బాట పట్టడం కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపినట్టవుతుంది. అటు ముడిచమురు ధరలు కూడా పైపైకి ఎగబాకుతోండటం ఆందోళనకరమే. ఇవి త్వరగా సద్దుమణగకపోతే రాబోయే రోజుల్లో బంగారంపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,422, 22 క్యారెట్లు - రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 11,035

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,422, 22 క్యారెట్లు- రూ. 13,220, 18 క్యారెట్లు - రూ. 10,816

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+