Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త క్రెడిట్‌ కార్డులు వచ్చేశాయ్.. వీటితో రూ.48 వేలు ఆదా!

భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాయి. 2023లో విడుదల చేసిన తమ తొలి క్రెడిట్ కార్డు విజయవంతం కావడంతో, ఇప్పుడు ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ' స్విగ్గీ బ్లాక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Swiggy BLCK HDFC Bank Credit Card), 'స్విగ్గీ ఆరంజ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Swiggy Ornge HDFC Bank Credit Card)' అనే రెండు కొత్త వేరియంట్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి

ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, డైనింగ్, షాపింగ్.. ట్రావెల్ వంటి విభాగాల్లో తరచుగా ఖర్చు చేసే వారికి గరిష్ట విలువను అందించడమే ఈ కార్డుల ప్రధాన లక్ష్యం. ఈ కార్డుల ద్వారా వినియోగదారులు ఏడాదికి గరిష్టంగా రూ.48,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ కొత్త కార్డుల ద్వారా స్విగ్గీ ప్లాట్‌ఫారమ్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, క్లియర్‌ట్రిప్, పేటీఎం ట్రావెల్ వంటి 30కి పైగా ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బలమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి.

Swiggy and HDFC Bank Elevate Everyday and Travel Rewards with the Launch of Two New Cobranded Credit Cards

డిస్కౌంట్ అండ్ క్యాష్ బ్యాగ్స్..

ముఖ్యంగా ప్రయాణ ప్రియుల కోసం క్లియర్‌ట్రిప్‌లో హోటల్ బుకింగ్‌లపై 19% తగ్గింపుతో పాటు 5% క్యాష్‌బ్యాక్, ఫ్లైట్ బుకింగ్‌లపై 6% తగ్గింపుతో పాటు 5% క్యాష్‌బ్యాక్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. అలాగే నైకా (Nykaa) యాప్‌లలో చేసే కొనుగోళ్లపై ఫ్లాట్ 5% తగ్గింపు మరియు అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇవి వినియోగదారుల రోజువారీ లైఫ్‌స్టైల్ ఖర్చులపై పొదుపును పెంచుతాయి.

అడిషనల్ బెనిఫిట్స్..

వేరియంట్ల విషయానికి వస్తే, 'Swiggy BLCK' కార్డును ప్రత్యేకంగా లైఫ్‌స్టైల్.. ప్రీమియం ఖర్చులు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ కార్డు హోల్డర్లకు స్విగ్గీపై చేసే ఖర్చులపై 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ట్రావెల్ & ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై 5% వరకు, ఇతర లావాదేవీలపై 1% క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. అదనపు ప్రయోజనంగా దీనితో పాటు 3 నెలల ఉచిత 'Swiggy One BLCK' సభ్యత్వం లభిస్తుంది. మరోవైపు, 'Swiggy Ornge' కార్డు రోజువారీ షాపింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్విగ్గీ మరియు ట్రావెల్ నుంచి లోకల్ క్యాబ్‌ల వరకు వివిధ ఆన్‌లైన్ కేటగిరీలలో 5% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. దీనితో పాటు 1% సాధారణ క్యాష్‌బ్యాక్ మరియు పూర్తి 12 నెలల 'స్విగ్గీ వన్' సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.

ఈ కార్డులను పొందాలంటే..

ఈ కార్డుల విడుదల సందర్భంగా స్విగ్గీ సహ-వ్యవస్థాపకుడు ఫణి కిషన్ అద్దేపల్లి మాట్లాడుతూ, వినియోగదారుల రోజువారీ ఖర్చులను మరింత లాభదాయకంగా మార్చడమే తమ ఉద్దేశమని తెలిపారు. HDFC బ్యాంక్ ప్రతినిధి విద్యా ప్రదీప్ మాట్లాడుతూ, విభిన్న వర్గాల వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్టుగా రివార్డులను అందించేందుకే ఈ రెండు వేరియంట్‌లను తెచ్చామని వివరించారు. ఈ కార్డులను పొందాలనుకునే వారు రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు స్విగ్గీ మొబైల్ యాప్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ల అర్హతను బట్టి తగిన కార్డు వేరియంట్‌ను బ్యాంక్ జారీ చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+