Credit Card వినియోగదారులకు షాక్, వార్షిక ఫీజు రెట్టింపు

హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇన్ఫినియా' (Infinia) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. అల్ట్రా-ప్రీమియం కేటగిరీలో ఉండే ఈ కార్డును మెయింటైన్ చేయడం ఇకపై సామాన్యులకే కాదు, సంపన్నులకు కూడా సవాల్‌గా మారనుంది. వార్షిక ఫీజు మినహాయింపు (Annual Fee Waiver) నిబంధనలను బ్యాంక్ ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెంచేసింది.

ఇన్ఫినియా కార్డుపై వార్షిక ఫీజు చెల్లించకుండా ఉండాలంటే, ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షలు ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ, తాజా నిబంధనల ప్రకారం ఈ పరిమితిని ఏకంగా రూ.18 లక్షలకు పెంచారు. అంటే, మీరు నెలకు సగటున రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తేనే వార్షిక ఫీజు నుండి తప్పించుకోగలరు.

HDFC Infinia Alert Annual Fee Waiver Limit Hiked to Rs 18 Lakhs New Relationship Value Rules Explained

HDFC కొత్త రూల్స్ ఇవే:

బ్యాంక్ పంపిన ఈమెయిళ్ల ప్రకారం, ఇన్ఫినియా ప్రోగ్రామ్‌లో కొనసాగాలంటే ఈ రెండు షరతుల్లో కనీసం ఒకటి పాటించాలి:

  • వార్షిక వ్యయం: ప్రైమరీ మరియు యాడ్-ఆన్ కార్డులు కలిపి ఏడాదికి కనీసం రూ.18 లక్షలు ఖర్చు చేయాలి.
  • : బ్యాంక్‌తో మీకున్న అనుబంధం విలువ (పొదుపు, కరెంట్ ఖాతాలు, ఎఫ్‌డీలు కలిపి) కనీసం రూ.50 లక్షలు ఉండాలి.

పాత కస్టమర్లకు ఊరట!

ఈ కఠిన నిబంధనల నుండి పాత కస్టమర్లకు కొంత సమయం ఇచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ. FY26 (ఆర్థిక సంవత్సరం 2026) వరకు పాత నిబంధనలే వర్తిస్తాయి. అంటే, మార్చి 2027 వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం మొదటి సమీక్ష ఏప్రిల్ 2027లో జరుగుతుంది. ఈలోపు కార్డుదారులు తమ ఖర్చులను లేదా బ్యాంక్ బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేసుకోవడానికి తగిన సమయం లభిస్తుంది.

బ్యాంక్ ఎందుకు ఇలా చేస్తోంది?

క్రెడిట్ కార్డ్ రంగంలో ప్రస్తుతం 'లాభదాయకత' (Profitability) మంత్రం నడుస్తోంది. ప్రీమియం కార్డులపై ఇచ్చే రివార్డులు, లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాల వల్ల బ్యాంకులపై భారం పడుతోంది. అందుకే, కేవలం 'హై నెట్ వర్త్' (High Net Worth) కస్టమర్లను, అంటే బ్యాంక్‌తో లోతైన ఆర్థిక సంబంధం ఉన్నవారిని మాత్రమే నిలుపుకోవాలని హెచ్‌డిఎఫ్‌సి లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మార్పుల గురించి హెచ్‌డిఎఫ్‌సి వెబ్‌సైట్‌లో గానీ, బహిరంగ ప్రకటనల్లో గానీ ఎక్కడా పేర్కొనలేదు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈమెయిళ్ల ద్వారా సమాచారం పంపుతోంది. ఇది దశలవారీ అమలును సూచిస్తోంది. దీనిపై వివరణ కోరగా బ్యాంక్ నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+