వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు సృష్టించిన టీసీఎస్: రూ.7లక్షల కోట్ల కంపెనీగా అవతరణ

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్) మరో అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే దేశీయ తొలి 100 బిలియన్‌ డాలర్ల ఐటీ కంపెనీగా రికార్డు సృష్టించిన టీసీఎస్‌.. తాజాగా ఆ రికార్డును బద్దలుకొట్టి రూ.7లక్షల కోట్ల మైలురాయికి దూసుకెళ్లింది.

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఐటీ కంపెనీ ఇదే కావడం విశేషం. శుక్రవారం నాటి మార్కెట్‌ ఆరంభంలో టీసీఎస్‌ షేర్లు రాణించడంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.7,03,309కోట్లకు చేరింది. శుక్రవారం ఉదయం టీసీఎస్‌ షేరు విలువ 1.91శాతం పెరిగి రూ. 3,647గా ఉంది.

TCS hits fresh record high with market cap of Rs 7 lakh crore

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంస్థ షేరు విలువ 35శాతం వరకు పెరిగింది. టీసీఎస్‌ తర్వాత రూ. 5.83లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో ఉంది. రూ.5.19లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ, రూ. 3.42లక్షల కోట్లతో హెచ్‌యూఎల్‌, రూ. 3.30లక్షల కోట్లతో ఐటీసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

English summary
A month after hitting market cap of USD 100 billion, Tata Consultancy Services on Friday hit a record Rs 7 lakh crore m-cap. The stock also touched a fresh 52-week high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X