• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్విట్టర్ సీటీవోగా ఐఐటీయన్‌కు గౌరవం

By Swetha Basvababu
|

చెన్నై: సోషల్ మీడియా సంచలనం మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఐఐటీ - బాంబే పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఆయన ట్విట్టర్ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో)గా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే (ఐఐటీ-బీ) పూర్వ విద్యార్ధి. 2016 చివరలో రాజీనామా చేసిన అడాం మెసెంజర్‌ స్థానంలో అగర్వాల్‌ను కొత్తగా నియమించినట్టు ట్విట్టర్‌ ప్రకటించింది.

సోషల్‌ మీడియాలో అబ్యూసింగ్‌ నివారణ, ట్వీట్ల ఔచిత్యాన్ని పెంచడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా ఎఐ ప్లాట్‌ఫాంపై ఆయన పని చేస్తారని ట్విట్టర్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాజిక నెట్‌వర్క్‌ దుర్వినియోగం నివారణపై సీటీవోగా అగర్వాల్‌ దృష్టి పెట్టనున్నారని ట్విటర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత అక్టోబర్ నెలలోనే సంస్థ సీటీవోగా బాధ్యతలు చేపట్టారు.

ట్విట్టర్ టెక్నాలజీ వ్యూహం ఖరారులో పరాగ్ అగర్వాల్ కీలకం

కాగా పరాగ్ అగర్వాల్ 2011లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర‍్శిటీనుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈ పదవికి ఎంపిక కాకముందు అగర్వాల్‌ ఏటి అండ్‌టీ, మైక్రోసాఫ్ట్‌, యాహూలలో ఇంటర్నషిప్‌గా పరిశోధనలు చేశారు. ట్విట్టర్ టెక్నాలజీ వ్యూహాన్ని ఖరారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. ట్విట్టర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టీమ్స్, మెషిన్ లెర్నింగ్ తదితర అంశాల్లో ముఖ్య భూమిక పోషిస్తారు. పరాగ్ అగర్వాల్ 2011లో యాడ్స్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించారు. యాడ్స్ సిస్టమ్స్ స్కేలింగ్, ఆన్ లైన్ మెషిన్ లెర్నింగ్ తదితర అంశాల్లో వేదికలు ఏర్పాటు చేశారు.

Twitter appoints Parag Agrawal as CTO

సిమెంట్, ఉక్కు కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక

ధరలు పెంచడానికి కుమ్మక్కయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సిమెంట్, ఉక్కు రంగ కంపెనీలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ హెచ్చరించారు. ఇటీవల కాలంలో మౌలిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయని, నాణ్యతలో రాజీపడకుండా ప్రాజెక్ట్‌ల వ్యయాలను తగ్గించేలా కొత్త టెక్నాలజీలు ఉండాలని సూచించారు. రాయల్టీ, కార్మికుల వ్యయాలు పెరగకపోయినా, నిర్మాణ రంగంలో వ్యయాలు పెరిగాయని చెప్పారు. కంపెనీలు కుమ్మక్కవ్వడం వల్లే సిమెంట్, ఉక్కు ధరలు పెరిగాయని వివరించారు. ఇప్పుడు ఇసుక ధర కూడా సిమెంట్‌ ధరతో సమానమైందని తెలిపారు.

Twitter appoints Parag Agrawal as CTO

అక్రమాలకు పాల్పడితే మంచిది కాదు.. కంపెనీలదే నియంత్రణ బాధ్యత

కంపెనీలు లాభాలు ఆర్జించడం పట్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే ఆ లాభార్జన సమంజసంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అది మంచిది కాదని, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీదేనని, ఈ విషయమై తీవ్రమైన కసరత్తే చేస్తున్నామని వివరించారు. కంపెనీలు కుమ్మక్కై ధరలను పెంచితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను రైతు బిడ్డనని, నీటి వనరుల సమర్థ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తగినంతగా నీటి వనరులు లేకపోవడం వల్ల పంటలు సరిగ్గా పండటం లేదని, ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Twitter appoints Parag Agrawal as CTO

English summary
Twitter has appointed Parag Agrawal as the Chief Technology Officer (CTO). Twitter has updated the website with information about Parag.Parag is the Chief Technology Officer, leading technical strategy for the company and overseeing machine learning and AI across our product and infrastructure teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X