ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరితే రూ.2 లక్షలు?
సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేకరకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తెస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (National Savings Certificate NSC) స్కీమ్ లో పొదుపు చేయడంద్వారా రూ. 2 లక్షలు ఏ విధంగా అందుకోవచ్చో చూద్దాం.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.7 శాతానికి చేరింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది కొనసాగుతోంది. పథకం కాల పరిమితి 5 సంవత్సరాలు. ఇందులో వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెడితే వడ్డీ రూపంలో రూ.400 అందుతుంది. పెద్ద మొత్తం పెట్టుబడిగా పెడితే అంతే మొత్తంలో వడ్డీని అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడునెలలకు ఒకసారి వడ్డీరేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. పెరిగినదాన్ని తగ్గించడం ఉండదు. మళ్లీ పెంచడం లేదంటే స్థిరంగా ఉంచడం చేస్తుంది.

ఈ పథకంలో ఎవరైనా చేరవచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ల పేరుమీద కూడా తెరవొచ్చు. కాకపోతే గార్డియన్ ఉండాలి. 10 సంవత్సరాల వయసు పైబడినవారంతా ఎవరైనా ఇందులో చేరవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. ఈ పథకంద్వారా వచ్చే వడ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ఈ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేశామనుకుంటే మెచ్యూరిటీ కల్లా రూ. 7. 50 లక్షలు అందుతాయి. వడ్డీ రూపంలోనే రూ.2 లక్షలకుపైగా వస్తాయి. రిస్క్ తక్కువగా ఉండే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకనేవారికి ఈ పథకం మంచి అవకాశం.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లైతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్‌లో ప్రతి ఏడాది పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. రాబడితోపాటు పన్ను మినహాయింపు పొందాలనుకునేవారు ఇందులో చేరొచ్చు. సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఎంతో అనువుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications