girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు. ప్రియురాలి ఒత్తిడితో ఆమెను ప్రియుడు సీక్రేట్ గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ప్రేమికులు ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నారు.
చెన్నై/వేలూరు/చిత్తూరు: యువతి, యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు, తరువాత ఇద్దరూ నేరుగా కలుసుకున్నారు. కొంతకాలం తరువాత ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు.
ప్రియురాలి ఒత్తిడితో ఆమెను ప్రియుడు సీక్రేట్ గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ప్రేమికులు ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నారు. కొన్ని నెలల తరువాత ప్రియురాలు కొండ మీద హత్యకు గురైయ్యింది.

కొండ మీద యువతి శవం
తమిళనాడులోని వేలూరులోని బాలమతి కొండ మీద 22 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇది చూసి అటుగా వెళ్తున్న ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అనంతరం నిందితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు ఇన్‌స్పెక్టర్ సెంథిల్‌కుమార్‌తో సహా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతురాలి ముఖాన్ని రాయితో నుజ్జునుజ్జు చేశారని పోలీసులు గుర్తించారు.

ఏఎస్ఐ కొడుకు అరెస్టు
హత్యకు గురైన యువతి మెడలో తాళి ఉంది. దీంతో ఆమెకు పెళ్లి అయ్యిందని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో హత్యకు గురైన యువతి ఆచూకి తెలియక పోవడంతో పోలీసులు ఇబ్బంది ఎందుర్కొన్నారు. యువతిని హత్య చేసి కొండపై నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో పోలీసులు వేలూరు నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రమేష్‌బాబు కుమారుడు కార్తీ అలియాస్ కార్తీక్ (23) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సీక్రేట్ గా లవర్స్ పెళ్లి
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే వియాలు వెలుగులోకి వచ్చాయి. కార్తీక్ తమిళనాడులోని చిదంబరానికి చెందిన గుణప్రియ అలియాస్ ప్రియా (22) అనే యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యిందని వెలుగు చూసింది. రానురాను కార్తీక్, ప్రియా ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు, తరువాత ప్రియా, కార్తీక్ ఇద్దరూ నేరుగా కలుసుకున్నారు. ఆ తరువాత ప్రియా ఒత్తిడి మేరకు 6 నెలల క్రితం ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారని సమాచారం.

ప్రియురాలు వెళ్లింది
పెళ్లయ్యాక గుణప్రియా అలియాస్ ప్రియా ఆమె సొంత ఊరు అయిన చిదంబరంలోని ఆమె ఇంట్లోనే ఉంటోంది. కార్తీక్ వేలూరులోని అతని ఇంటిలో ఉంటున్నాడు. 2 రోజుల క్రితం ప్రియా వేలూరుకు వచ్చింది. ప్రియురాలు ప్రియాను కార్తీక్ మొదట ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు సమీపంలోని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడని తెలిసింది. తరువాత కార్తీక్ అతని ప్రియురాలు ప్రియాను వేలూరుకు పిలుచుకుని వెళ్లాడు.

అందరి ముందు పెళ్లి చేసుకోవాలని చెప్పిన ప్రియురాలు
వేలూరులోని బాలమతి కొండ మీదకు ప్రియురాలు ప్రియాను కార్తీక్ తీసుకెళ్లాడు. తరువాత ప్రియా ఆమె ప్రియుడు కార్తీక్ ను అందరి ముందు లాంఛనంగా పెళ్లి చేసుకుని కాపురం చెయ్యాలని ఒత్తిడి చేసింది. దీనిపై కార్తీక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మనం ఎంజాయ్ చేసి విడిపోదామని ప్రియాకు చెప్పాడని, అందరి మందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అందుకే ప్రియాను చంపేశాడు
ఈ వివాదంలో ప్రియాపై కార్తీక్ దాడి చేశాడు. తరువాత ఆగ్రహానికి గురైనప కార్తీక్ అక్కడే పడి ఉన్న రాయిని తీసుకుని ప్రియా ముఖం మీద దాడి చేసి ఆమెను చంపేశాడు. తరువాత ప్రియా శవాన్ని అక్కడి నుంచి విసిరేసిన కార్తీక్ అక్కడి నుంచి పరారైనాడు.
పోలీసు అధికారి అయిన తాను కేసు తప్పించుకుంటానని కార్తీక్ అనుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రియురాలు ప్రియాను సీక్రేట్ గా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెను ఓ పోలీసు అధికారి కొడుకు అయిన కార్తీక్ పర్యాటక కేంద్రం అయిన కొండ మీద హత్య చేసి శవాన్ని విసిరేయడం వేలూరుతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications