భర్తను ఇనుప రాడ్ తో కొట్టి, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన గర్బిణి భార్య, క్లైమాక్స్ లో!
చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఆమె భర్త వదిలేశాడు. భర్త చనిపోయిన మహిళను భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగింది. ఇదే సమయంలో రెండో భార్య గర్బవతి అయ్యింది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ రెండో భర్త గొడవకు దిగాడు. రెండో భార్య ఆమె భర్త మర్మాంగం కోసేసి చంపేసింది.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా పల్లవర్ మేడు ప్రాంతంలో సంతానం (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం సంధ్యా అనే అమ్మాయిని ప్రేమించిన సంతానం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ సంధ్యా మాత్రం సంతానం సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. అక్రమ సంబంధం విషయంలో మనస్పర్థలు రావడంతో సంధ్యా, సంతానం విడిపోయారు.

తరువాత సంతానంకు అతని భార్య సంధ్యా దూరం కావడంతో వందనా (29) అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంతానం కుటుంబ సభ్యులు అతనికి వందనాతో రెండో పెళ్లి జరిపించారు. వందనాకు అప్పటికే వివాహమై 6 ఏళ్ల కుమార్తె ఉంది. వందనా భర్త కిడ్నీ వ్యాధి కారణంగా మూడేళ్ల క్రితం చనిపోయాడు. నీ బిడ్డను కూడా చూసుకుంటానని వందనాను సంతనాం రెండో పెళ్లి చేసుకున్నాడు.
సంతానంతో పెళ్లయిన తర్వాత వందనా చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని నిత్యం వారితో మాట్లాడుతూ వారితో తిరగడం మొదలుపెట్టింది. దీంతో సంతానం అతని రెండో భార్య వందనాపై అనుమానం పెంచుకుని తరచూ ఆమెతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. అలాగే సంతానం కూడా వారానికి రెండు సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. సంతానంపై అతని రెండో భార్య వందనాకు కూడా అనుమానం వచ్చింది.
ఇదే సమయంలో వందనా గర్భవతి అయ్యింది. ప్రస్తుతం వందనా ఆరు నెలల గర్బవతి. నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ సంతానం అతని భార్య వందనాతో గొడవకుదిగాడు. ఇదే విషయంలో సంతానం, వందనా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన ఆరు ఏళ్ల బిడ్డను తన మాజీ భర్త ఇంట్లో వదిలేసిన వందనా ఇక నీబిడ్డ నా ఇంటికి రాకూడదని మాజీ భర్తకు తేల్చి చెప్పింది.

ఈ విషయంలో గత వారం రోజులుగా సంతానం, వందనాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనుమానంతో భర్త సంతానం తనను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వందనా పలువురు బంధువులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి సంతానం, వందనాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరి మద్య వాగ్వివాదం ముదిరిపోవడంతో ఇనుపరాడ్ తీసుకున్న వందనా ఆమె భర్త సంతానం తల మీద దాడి చేసింది.
తల మీద ఒక్కసారిగా దాడి జరగడంతో సంతానం కిందపడిపోయాడు. అంతటితో ఆవేశం ఆపుకోలేని వందనా కిందకు జారిపడిన భర్త మెడ, అతని మర్మాంగాన్ని కత్తితో కోసేసి చంపేసింది. భర్త సంతానం మృతదేహాన్ని ఇంట్లో వదిలి వెళ్లిన వందనా ఆమె మాజీ భర్త ఇంటికి వెళ్లి తన బిడ్డను చివరిసారి చూసుకుంది. మాజీ అత్త వండిన భోజనం తిన్న తర్వాత వందనా నేరుగా సంతానం ఇంటికి తిరిగి వెళ్లింది.
ఆ తర్వాత తన భర్త సంతానంను చంపేశానని, నేను ఆత్మహత్య చేసుకుంటానని వందనా ఆమె బంధువులు కొందరికి ఫోన్ లో చెప్పింది. సూసైడ్ లెటర్‌లో 'తనకు బతకాలనే కోరిక లేదు. సంతానం నాకు చాలా చిత్రహింసలు పెట్టాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని నేనే నా చేతులతో చంపేశానిన రాసింది. తన బిడ్డను, తండ్రిని, తల్లిని బాగా చూసుకోవాలని సోదరుడికి కూడా ఫోన్ చేసి చెప్పింది.

డెత్ నోట్ లో తాను ఎవరికి ఎంత డబ్బు చెల్లించాలి, తనకు ఎవరు ఎంత మొత్తం ఇవ్వాలి అని వందనా రాసిపెట్టింది. దీంతో ఫోన్‌లో వందనా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఇంటికి బంధువులు పరుగు తీశారు. అప్పటికే సంతానం దారుణ హత్యకు గురై ఇంట్లో పడిఉన్నాడు. చీరకు వేలాడుతున్న వందనాను రక్షించి కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వందనాను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందిందని ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న శివకంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతానం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వందనా, ఆమె కుటుంబీకులు కలిసి సంతానంను హత్య చేశారని సంతానం బంధువులు ఫిర్యాదు చేశారు. భర్త మర్మాంగం కోసి చంపేసిన ఆరు నెలల గర్బవతి ఆమె ఆత్మహత్య చేసుకోవడం కాంచీపురంలో కలకలం రేపింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications