Teacher: ఊగుతూ పాఠాలు చెబుతున్న టీచర్, ఉత్సాహం కాదు, మద్యం మత్తులో ఊపు, కట్ చేస్తే?

చెన్నై/సేలం: తాను స్కూల్ టీచర్ అని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని ఓ టీచర్ పూర్తిగా మరిచిపోయాడు. ప్రతిరోజు మద్యం సేవించి స్కూల్ కు వెళ్లి అటూఇటు ఊగుతూ పిల్లలకు పాఠాలు చెప్పాడు. స్కూల్ ఆవరణంలో సిగరెట్లు తాగడం, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థుల మీద దాడి చెయ్యడం చేస్తున్నాడు.

మ్యాటర్ తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ లోకి వెళ్లి ఆ టీచర్ ను చితకబాదేశారు. ఆ టైమ్ లో కూడా టీచర్ ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నాడు. హెడ్ మాస్టర్ లేడీ కావడంతో ఆమె చూసిచూడనట్లు ఉందని ఆరోపణలు ఉన్నాయి.

 ప్రభుత్వ స్కూల్ లో టీచర్

ప్రభుత్వ స్కూల్ లో టీచర్

తమిళనాడులోని సేలం సమీపంలోని సెలతంబట్టి ప్రభుత్వ పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో సురేష్ బాబు అనే వ్యక్తి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పాఠశాల ఆవరణలోనే టీచర్ సురేష్ బాబు ప్రతినిత్యం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. కొన్ని సంవత్సరాలు సురేష్ బాబు ఆ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న టీచర్ సురేష్ బాబు విద్యార్థులకు చదువుతో పాటు బుద్దిమాటలు చెప్పకుండా అతను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు,

విద్యార్థులకు లైంగిక వేధింపులు?

విద్యార్థులకు లైంగిక వేధింపులు?

ప్రతిరోజు మద్యాహ్నం మద్యం సేవించి పాఠశాలకు వచ్చే సురేశ్‌బాబు విద్యార్థినులను లైగింక వేధింపులకు గురిచేస్తున్నాడని, టాయిలెట్‌ దగ్గర నిల్చొని సిగరెట్లు తాగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అటువైపు వెళ్లిన విద్యార్థుల మీద దాడులు చేసి వారిని కాళ్లు పట్టుకోవాలని చెబుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

మేడమ్ పట్టించుకోలేదు

మేడమ్ పట్టించుకోలేదు

విద్యార్థినులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ముహరత్‌ బేగంకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని తెలిసింది. స్కూల్ లో జరుగుతున్న విషయాలను కొందరు విద్యార్థులు వారి ఇంట్లో చెప్పవద్దని హెడ్ మాస్టర్ ముహరత్ బేగం, టీచర్ సురేష్ బాబు బెదిరించారని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 టీచర్ ను చితకబాదిన తల్లిదండ్రులు

టీచర్ ను చితకబాదిన తల్లిదండ్రులు

ఈ క్రమంలో టీచర్ సురేష్ బాబు స్కూల్ లో అరాచకాలకు పాల్పడుతున్నాడని కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆవేశంతో సంబంధిత ఉపాధ్యాయుడు సురేష్ బాబుపై దాడికి పాల్పడ్డారు. పాఠశాలను ముట్టడించి నిరసన కొనసాగించారు. వెంటనే సురేష్ బాబును ఉద్యోగం నుంచి సస్పెండ్ చెయ్యాలని నినాదాలు చేశారు.

 ఆ టైమ్ లో పీకలదాక మద్యం తాగిన టీచర్

ఆ టైమ్ లో పీకలదాక మద్యం తాగిన టీచర్

విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాలలో గొడవ చేస్తున్నారని సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బాధిత విద్యార్థులతో విచారణ జరిపారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు దాడి చేసి సమయంలో టీచర్ సురేష్‌బాబు పీకలదాక మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సురేష్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సూరమంగళం పోలీసు అధికారులు అంటున్నారు. మద్యం సేవించి స్కూల్ కు రాకూడదని, స్కూల్ క్యాంపస్ లో సిగరెట్లు తాగకూడదని టీచర్ సురేష్ బాబుకు మేము చాలా సార్లు చెప్పామని, అయినా అతను ఎవ్వరి మాట వినలేదని సాటి టీచర్లు చెప్పారని పోలీసులు అన్నారు. ఇంతకాలం మద్యం మత్తులో వస్తున్న టీచర్ ను చూసిచూడనట్లు వదలేశామని, అమ్మాయిలను టార్చర్ పెట్టడంతో సురేష్ బాబు మీద దాడి చేశామని గ్రామస్తులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+