చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chennai: చెన్నై చిత్తడి, గంట గ్యాప్ లేకుండా, 15 మంది ఐఏఎస్ లు, స్టాలిన్ మార్క్ సహాయం, ఆంధ్రాకు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కాంచీపురం: భారీ వర్షాల కారణంతో తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని అనేక ప్రాంతాల ప్రజలు వరద నీటిలో దినచర్యలు మొదలు పెట్టారు. చెన్నై సిటీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నైతో పాటు తమిళనాడులో సీఎం స్టాలిన్ మార్క్ సహాయక చర్యలు మొదలైనాయి. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సిటీలో ముఖ్యంగా 15 డివిజన్లలో పరిస్థితి మరి దారుణంగా తయారైయ్యింది. చెన్నై సిటీలో సుమారు 4 నుంచి 5 అడుగల వరద నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

15 డివిజన్లలోని ప్రజలు వంట చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఆహారం సరఫరా చేస్తోంది. 15 డివిజన్లలోని ప్రజలకు మూడు పూటల ఆహారం అందించడానికి 15 మంది ఐఏఏస్ అధికారులను నియమించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ గంట గంటలకు చెన్నై సిటీతో పాటు తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 48 గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

IT Hub: రిటైడ్ ప్రిన్సిపాల్, బ్యాంకు ఉద్యోగికి స్వర్గం చూపించారు, త్రిషా, పెద్దారెడ్డికి సీన్ రివర్స్!IT Hub: రిటైడ్ ప్రిన్సిపాల్, బ్యాంకు ఉద్యోగికి స్వర్గం చూపించారు, త్రిషా, పెద్దారెడ్డికి సీన్ రివర్స్!

48 గంటలు ఇదే పరిస్థితి

48 గంటలు ఇదే పరిస్థితి

తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంతో తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని అనేక ప్రాంతాల ప్రజలు వరద నీటిలో దినచర్యలు మొదలు పెట్టారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీతో పాటు కన్యాకుమారి. మదురై, కాంచీపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో సోమవారం కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా తమిళనాడులో వర్షాల దెబ్బతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది.

చెన్నై చిత్తడి..... గంట గ్యాప్ లేకుండా భారీ వర్షాలు

చెన్నై చిత్తడి..... గంట గ్యాప్ లేకుండా భారీ వర్షాలు

చెన్నై సిటీలోని వేలచ్చేరి, సైదాపేట, టీ, నగర్, గిండీ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. చెన్నై సిటీలో గంట గ్యాప్ ఇవ్వకుండా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మహిళలు, పిల్లలు రోడ్ల మీదకు రావాలంటే హడలిపోతున్నారు. చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపోయాయి. చెన్నై సిటీ ప్రజలు భారీ వర్షాల దెబ్బతో తడిచి ముద్ద అయిపోతున్నారు.

2015 సీన్ రిపిట్ అయితే ?

2015 సీన్ రిపిట్ అయితే ?

2015లో చెన్నై సిటీలో పడిన వర్షాల దెబ్బతో అనేక మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. కొన్ని రోజుల పాటు చెన్నై ప్రజలు అప్పట్లో భారీ వర్షాల దెబ్బతో కోలుకోలేకపోయారు. 2015 తరువాత మరోసారి 2021 నవంబర్ లో మరోసారి అలాంటి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయితే ఏం చెయ్యాలి దేవుడా అంటూ ప్రజలు హడలిపోతున్నారు.

15 డివిజన్లు......15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు

15 డివిజన్లు......15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు

చెన్నై సిటీలో ముఖ్యంగా 15 డివిజన్లలో పరిస్థితి మరి దారుణంగా తయారైయ్యింది. చెన్నై సిటీలో సుమారు 4 నుంచి 5 అడుగుల ఎత్తులో వరద నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరిపోయింది. 15 డివిజన్లలోని ప్రజలు వంట చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఆహారం సరఫరా చేస్తోంది. 15 డివిజన్లలోని ప్రజలకు మూడు పూటల ఆహారం అందించడానికి 15 మంది ఐఏఏస్ అధికారులను నియమించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గంటగంటకు ఆరా తీస్తున్న సీఎం స్టాలిన్..... ఆఫీసులు క్లోజ్

గంటగంటకు ఆరా తీస్తున్న సీఎం స్టాలిన్..... ఆఫీసులు క్లోజ్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ గంట గంటలకు చెన్నై సిటీతో పాటు తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. చెన్నై సిటీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తమిళనాడు, తమిళనాడు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న సీనియర్ మంత్రి దురై మురుగన్ కూడా రంగంలోకి దిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దేవుడిని వేడుకుంటున్న ప్రజలు

దేవుడిని వేడుకుంటున్న ప్రజలు

చెన్నై సిటీలో 2015 పడిన భారీ వర్షాల కారణం ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ కాకుండా ఆ దేవుడిని వేడుకుంటున్నామని మంత్రి దురై మురుగన్ సోమవారం స్థానిక మీడియాకు చెప్పారు. చెన్నై సిటీ ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాలను లెక్కచెయ్యకుండా కొందరు అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడంతో చెన్నై సిటీని కొన్ని ప్రాంతాల్లో చాలా మందికి అహారం అందక ఆకలితో కడుపులు కాల్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 తమిళనాడులో హై అలర్ట్, ఆంధ్రాకు ఎఫెక్ట్ ?

తమిళనాడులో హై అలర్ట్, ఆంధ్రాకు ఎఫెక్ట్ ?

తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 48 గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నవంబర్ 9వ తేదీ, 10వ తేదీ కూడా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా చెన్నై సిటీలోని 15 డివిజన్లలో వాహన సంచారానికి అధికారులు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.

English summary
Chennai Rain: Tamil Nadu CM MK Stalin announcement and Chennai Gov offices declared holiday today due to heavy rain. North chennai suffering due to heavy rain and Corporation officials not taking action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X