MK Stalin మార్క్ పెను సంచలనం: సోనియాను కలిసిన రెండోరోజే: రఘురామ్ రాజన్‌కు కీలక పదవి
చెన్నై: తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. పాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. సరికొత్త నిర్ణయాలను తీసుకుంటోన్నారు. తమిళనాడు ఆర్థిక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అందులో రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు చోటు కల్పించింది. ఆయన మాత్రమే కాదు.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఎస్తేర్ డఫ్లోను కూడా అందులో చేర్చింది. ఈ మేరకు నిండు అసెంబ్లీలో ఓ ప్రకటన చేసిందక్కడి ప్రభుత్వం.
ఎస్తేర్ డఫ్లో ఎవరో కాదు.. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ భార్య. 2019లో భార్యాభర్తలిద్దరూ ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, ఎకనమిస్ట్ జీన్ డ్రెజె, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ నారాయణ్‌లను ఇందులోకి తీసుకున్నారు. ఈ ఆర్థిక మండలికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఈ ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తోన్నట్లు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. తమిళనాడు మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని ఆయన సభలో చదివి వినిపించారు. ఈ ఆర్థిక మండలి అందజేసే సలహాలు, సూచనలు, సిఫారసులను ప్రభుత్వం స్వీకరిస్తుందని, వాటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తామని గవర్నర్ ప్రకటించారు.
Recommended Video
కాగా- రెండు రోజుల కిందటే ఎంకే స్టాలిన్ దేశ రాజధానిలో పర్యటించి వచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. భార్య దుర్గావతి స్టాలిన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. తన పర్యటన సందర్భంగా ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. వారితో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే- కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే- తమిళనాడు ఆర్థిక మండలి ఏర్పాటు ప్రకటన రావడం, రఘురామ్ రాజన్‌కు చోటు కల్పించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.












Click it and Unblock the Notifications