college: రాత్రి కాలేజ్ అమ్మాయిలను ఎక్సర్ సైజ్ లకు పిలిచిన ప్రిన్సిపాల్ కు పగిలిపోయింది. రివర్స్!
కాలేజ్ అమ్మాయిల లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే బెయిల్ మీద బయట ఉన్న ఈ ప్రిన్సిపాల్ ఇప్పుడు ఏకంగా మైనర్ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఫోక్స్ కేసులో చిక్కుకున్నాడు.
చెన్నై/కొచ్చి: ప్రముఖ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి గతంలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. ఆసియా, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయన బంగారు, రజతం, కాస్య పతకాలు. మంచిమంచి అవార్డులు సొంతం చేసుకున్నాడు. బాడీబిల్డర్ పోటీల్లోనా మంచి గుర్తింపు తెచ్చుకుని పలు పతకాలు సొంతం చేసుకున్నాడు.
కాలేజ్ అమ్మాయిల లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే బెయిల్ మీద బయట ఉన్న ఈ ప్రిన్సిపాల్ ఇప్పుడు ఏకంగా మైనర్ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఫోక్స్ చట్టం కింద అరెస్టు కావడం కలకలం రేపింది.

చెన్నై కాలేజ్ లో ప్రిన్సిపాల్
కేరళకు చెందిన జార్జ్ అబ్రహం(50) చెన్నైలోని ప్రముఖ నందనం వైఎంసీఏ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. జార్జ్ అబ్రహాం తమిళనాడు స్థాయి పోటీలు, భారత స్థాయి పోటీలు, క్రీడా పోటీలలో, ఆసియా స్థాయి పోటీలలో అనేక బంగారు పతకాలు, రజత పతకాలు, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. అలాగే బాడీ బిల్డింగ్‌లో జిల్లా స్థాయి బహుమతులను కూడా అబ్రహాం గెలుచుకున్నాడు.

జిమ్ వర్క్ అవుట్ శిక్షణ
నందనం వైఎంసీఏ కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహం శిక్షణకు వచ్చే కళాశాల విద్యార్థులకు జిమ్ వర్క్ అవుట్ లో కూడా ఆయనే శిక్షణ ఇస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జిమ్నాసియం కళాశాలలో శిక్షణ కోసం వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడని అప్పట్లో అబ్రహాం మీద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
రాత్రిపూట విద్యార్థినికి ఫోన్ చేసి వ్యాయామ చిట్కాలు ఇస్తూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నాడని అబ్రహాం మీద ఆరోపణలు ఉన్నాయి.

బెయిల్ తీసుకుని తప్పించుకున్న ప్రిన్సిపాల్
విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాంపై చెన్నైలోని సైదాపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైదాపేట్ మహిళా పోలీసులు కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాంపై అట్రాసిటీ నిరోధక చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టంలోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాంకు ముందస్తు బెయిల్ మంజూరైంది. బెయిల్ రావడంతో కొద్ది రోజుల్లోనే అబ్రహాం కాలేజీకి తిరిగి వెళ్లి ఉద్యోగంలో చేరారు.

రాత్రి ఎక్సర్ సైజులు
ఈ నేపథ్యంలో వైఎంసీఏ కాలేజీ మేనేజ్‌మెంట్ కమిటీ ఆదివారం సైదాపేట్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కాలేజ్ ప్రిన్సిపాల్ అబ్రహాం మీద స్వయంగా ఫిర్యాదు చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు. గతేడాది శిక్షణకు వచ్చిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాం లైగింక వేధింపులకు గురిచేస్తున్నాడని, ముఖ్యంగా 18 ఏళ్లు నిండని విద్యార్థిని ఒంటరిగా జిమ్‌కు వచ్చేలా చేశాడని కళాశాల యాజమాన్యం తెలిపింది.
సాయంత్రం ప్రత్యేక శిక్షణ కోసం ఆమెకు ఎక్సర్‌సైజులు, లెగ్ ఎక్సర్‌సైజులు చేయమని చెప్పి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని కాలేజ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రిన్సిపాల్ దూల తీరిపోయింది
చెన్నైలోని సైదాపేట్ పోలీసులు బాధితురాలిని విచారించగా కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాం విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ అయింది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ జార్జ్ అబ్రహాంపై పోక్సో చట్టం, మహిళలపై హింసా నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన సైదాపేట్ మహిళా పోలీసులు కళాశాల ప్రిన్సిపాల్ అబ్రహాంను అరెస్టు చేశారు. విచారణ తర్వాత నిందితుడు అబ్రహాంను కోర్టు ముందు హాజరుపరిచారు కేసు విచారణలో ఉందని చెన్నై పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications