హర్ ఘర్ తిరంగా: చెన్నైలో గవర్నర్ తమిళిసై- ఇంటిపై జాతీయ జెండా రెపరెపలు
చెన్నై: ఇంకొన్ని గంటల్లో యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోనుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడబోతోన్నాయి. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరవుతారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
పంద్రాగస్టు వేడుకల సూచికంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటి మీదా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని సూచించింది. సోషల్ మీడియాను వినియోగించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని తమ డీపీలుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. చెన్నైలోని తన నివాసంపై జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాను హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించానని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ తమ ఇంటిపై జెండాలను ఎగురవేయాలని కోరారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications