చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: పెళ్లికి ముందే మస్త్ మజా, జల్సా, ప్రియురాలిని, కొడుకుని 30 ముక్కలు చేసి!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ సేలం/ తేని: పెళ్లికి ముందే ఆమెకు ప్రియుడు ఉన్నాడు. పెళ్లికి ముందు ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. భర్తతో కాపురం చేస్తున్న ఆమె పుట్టింటికి వచ్చి వెళ్లే సమయంలో ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. వివాహిత మహిళకు ఏడాది వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. తన దగ్గర భారీ మొత్తంలో బంగారం ఉందని వివాహిత మహిళ ప్రియుడికి చెప్పింది. ప్రియురాలి దగ్గర ఉన్న బంగారం చాలా వరకు ప్రియుడు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా జల్సాలు చేస్తూ వేధించాడు.

నా నగలు నాకు ఇచ్చేయ్, లేదా నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని ప్రియుడురాలు మొండికి వేయడంతో ప్రియుడు నిరాకరించాడు. అయితే ఆమె పట్టు వదలకుండా ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని పీడించింది. ప్రియురాలి టార్చర్ ఎక్కువ కావడంతో పక్కాప్లాన్ ప్రకారం ప్రియురాలిని, ఆమె కొడుకును ముక్కలు ముక్కలు నరికేసి 30 ముక్కలను మూడు మూటల్లో కట్టేసి కోనేరులో విసిరేశాడు. ప్రియురాలి దగ్గర ఉన్న బంగారు నగలు లూటీ చేసి ఇంతకాలం ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు.

Wife: రియల్ ఎస్టేట్ లో భర్తకు, బెడ్ రూమ్ లో భార్యకు పార్ట్నర్, 10 మందితో, రూ. లక్షలు ఇచ్చి!Wife: రియల్ ఎస్టేట్ లో భర్తకు, బెడ్ రూమ్ లో భార్యకు పార్ట్నర్, 10 మందితో, రూ. లక్షలు ఇచ్చి!

ప్రియురాలి పెళ్లి

ప్రియురాలి పెళ్లి

తమిళనాడులోని తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలోని కే. పుదుపట్టి కుప్పం ప్రాంతంలో కరుప్పుస్వామి అనే ఆయన నివాసం ఉంటున్నాడు. కరుప్పుస్వామి కుమార్తె కలైసెల్వి (22). మదురై జిల్లా పేరావూరుకు చెందిన కాశీరాజన్ అనే వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం కలైసెల్వి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కలైసెల్వికి ఆమె కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు ఇచ్చారు. కాశీరాజన్, కలైసెల్వికి ఏడాది వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు.

ఆరునెలల ముందు తల్లీ బిడ్డ మాయం

ఆరునెలల ముందు తల్లీ బిడ్డ మాయం

2020 సెప్టెంబర్ నెలలో అత్తారింటిలో ఉన్న కలైసెల్వి పుట్టింటికి వెళ్లి వస్తానని భర్త కాశీరాజన్ కు చెప్పి బిడ్డను ఎత్తుకుని పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉంది. 20 రోజులు పాటు పుట్టింటిలో ఉన్న కలైసెల్వి సెప్టెంబర్ చివరి వారంలో తాను భర్త ఇంటికి వెలుతున్నానని తండ్రి కురుప్పస్వామికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తరువాత కలైసెల్వి, ఆమె బిడ్డ ఆచూకి లేకపోవడంతో తన కుమార్తె కలైసెల్వి, మనుమడు కనపడటం లేదని కరుప్పస్వామి ఉత్తమపాళయం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

 గుడి కోనేరులో మూడు మూటలు

గుడి కోనేరులో మూడు మూటలు

2021 మార్చి 26వ తేదీ (రెండు రోజుల ముందు) చిన్నమనూరు అయ్యనార్ ఆలయం కోనేరులో మూడు గోనె సంచులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కోనేరూలోని మూడు సంచులు బయటకు తీసి పరిశీలించి షాక్ అయ్యారు. మహిళతో పాటు చిన్నారిని ముక్కలు ముక్కలుగా నరికి మూడు సంచుల్లో మూటకట్టి విసిరేశారని గుర్తించిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ప్రియుడికి చివరి ఫోన్ కాల్

ప్రియుడికి చివరి ఫోన్ కాల్

గోనే సంచుల్లోని దుస్తుల ఆధారంగా హత్యకు గురైయ్యింది కలైసెల్వి, ఆమె కొడుకు అని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. కలైసెల్వి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు, అంతకు ముందు ఎవరెవరితో మాట్లాడింది అంటూ పోలీసులు పూర్తి వివరాలు బయటకు లాగారు. భర్త కాశీరాజన్ తో కంటే ఉత్తమపాళయంలో నివాసం ఉంటున్న సిలంబరసన్ కన్నన్ అనే వ్యక్తితో కలైసెల్వి ఎక్కువ మాట్లాడిందని, చివరిసారిగా ఆమె మొబైల్ ఫోన్ నుంచి అతనికే ఫోన్ చేసిందని, కన్నన్, కలైసెల్వికి అక్రమ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు.

పెళ్లికి ముందే మస్త్ మజా

పెళ్లికి ముందే మస్త్ మజా

కలైసెల్వి, కన్నన్ ఒకే ప్రాంతానికి చెందిన వారు. కలైసెల్వి కంటే కన్నన్ కు ముందే పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కిరాణా షాపు నిర్వహిస్తున్న కన్నన్ తో కలైసెల్వికి అక్రమ సంబంధం ఉంది. కాశీరాజన్ ను పెళ్లి చేసుకున్న తరువాత కలైసెల్వి ప్రియుడు కన్నన్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది.

కేటుగాడు.... నగలు కుమ్మేశాడు

కేటుగాడు.... నగలు కుమ్మేశాడు

కలైసెల్వి దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు ఉండటంతో తనకు డబ్బు అవసరం ఉందని చెప్పిన ప్రియుడు కన్నన్ ఆమె దగ్గర అప్పుడప్పుడు కొంచెం కొంచెం అంటూ భారీ మొత్తంలో బంగారు నగలు ఇప్పించుకున్నాడు. నగలు పుట్టింటిలో ఉన్నాయని భర్తకు చెప్పడం, అత్తారింటిలో నగలు ఉన్నాయని పుట్టింటిలో చెప్పిన కలైసెల్వి ఆ నగలు ప్రియుడికి ఇచ్చింది.

నగలు ఇస్తావా ? పెళ్లి చేసుకుంటావా

నగలు ఇస్తావా ? పెళ్లి చేసుకుంటావా

కలైసెల్వి నగలు కుదువ పెట్టిన కన్నన్ ఆ డబ్బుతో ఓ కారు, రెండు ఆటోలు తీసుకుని వాటిని అద్దెకు తిప్పుతూ వచ్చే డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియుడు కన్నన్ ను కలిసిన ప్రతిసారి నా నగలు నాకు ఇచ్చేయాలని కలైసెల్వి చాలాసార్లు చెప్పింది. చివరిసారి నా నగలు నాకే ఇచ్చేయాలని, లేదంటే నేను భర్తను వదిలి వచ్చేస్తే నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలని కలైసెల్వి ప్రియుడు కన్నన్ కు చెప్పింది.

ప్రియురాలి టార్చర్..... మటన్ కత్తితో 30 ముక్కలుగా నరికేశాడు

ప్రియురాలి టార్చర్..... మటన్ కత్తితో 30 ముక్కలుగా నరికేశాడు

నగలు ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకోవాలని కలైసెల్వి పీడించడంతో కన్నన్ విసిగిపోయాడు. ప్రియురాలు కలైసెల్వి టార్చర్ ఎక్కవ కావడంతో ఎంజాయ్ చెయ్యడానికి రావాలని కన్నన్ చెప్పాడు. డౌట్ రాకుండా పుట్టింటి నుంచి బిడ్డతో పాటు వెళ్లిన కలైసెల్విని చంపేయాలని కన్నన్ డిసైడ్ అయ్యాడు. తన షాపులో పని చేస్తున్న రాజేష్ (18) అనే యువకుడి సహాయంతో మటన్ కత్తిరించే కత్తి తీసుకున్న కన్నన్ ప్రియురాలు కలైసెల్వి, ఆమె ఏడాది కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసి మూడు గోనె సంచుల్లో కట్టేసి కోనేరులో విసిరేశారు.

కలైసెల్వి శరీరం మీద ఉన్న బంగారు నగలను ప్రియుడు కన్నన్ లూటీ చేశాడు. కలైసెల్వి, ఆమె కొడుకును మేమే హత్య చేశామని కన్నన్, రాజేష్ అంగీకరించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Illegal affair: 22 year old woman and one year old baby brutally killed near Theni in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X