Illegal affair: నా భర్తకు బ్యూటీ పార్లర్ బ్యూటీస్ తో లింక్, నన్ను తన్నితరిమేసి దానితో మజా చేస్తున్నాడు !
చెన్నై/ టీ నగర్: బ్యూటీ పార్లర్ యజమాని అతని దగ్గర పని చేస్తున్న యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఆరు నెలల్లోనే భార్య పాతదైపోయిందని తెలిసింది. మూడు నెలల క్రితం అదే బ్యూటీ పార్లర్ లో పని చెయ్యడానికి వచ్చిన మరో యువతితో రొమాన్స్ చేస్తున్న తన భర్త ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని అతని భార్య ఆరోపించింది. బ్యూటీ పార్లర్ లో పని చేసే అనేక మంది యువతులు, వివాహిత మహిళలతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్య ఆరోపిస్తోంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తాను పుట్టింటి వాళ్లను ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చేశానని ఆమె బోరున విలపిస్తోంది. కొత్త ప్రియురాలు మోజులో తనను ఇంటి నుంచి బయటకు తన్నితరిమేసిన తన భర్త ప్రియురాలితో కలిసి ఏకంగా బ్యూటీ పార్లర్ మేడ మీద పెళ్లి కాకుండానే కాపురం పెట్టేశాడని, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని ఆరోపిస్తూ అతని భార్య అసిస్టెంట్ పోలీసు కమీషనర్ కార్యాలయం ముందే మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. బ్యూటీ పార్లర్ ముసుగులో నా మొగుడు అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుని అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని భార్య కేసు పెట్టడం కలకలం రేపింది.

ఫేమస్ బ్యూటీ పార్లర్
చెన్నై సిటీలోని అంబత్తూరులోని పుదురై ప్రాంతంలో నివాసం ఉంటున్న అజయ్ సత్యా అలియాస్ సత్యా (34) అనే యువకుడు అంబత్తూరులో టోని అండ్ గైస్ అనే బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. తిరుమళైవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కవిత (25) అనే యువతి కొన్ని నెలల క్రితం సత్యా నడుపుతున్న బ్యూటీ పార్లర్ లో ఉద్యోగంలో చేరింది.

మస్త్ మజా చేసిన సత్యా
బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం చేస్తున్న కవిత మీద మనసుపడిన సత్యా ఆమెకు దగ్గర అయ్యాడు. కవిత ఆమె పని చేస్తున్న బ్యూటీ పార్లర్ యజమాని సత్యాతో చనువుగా ఉండేది. కొన్ని నెలల క్రితం ప్రేమలో పడిన సత్యా, కవిత పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పిన సత్యాతో కవిత హద్దులు దాటిపోయిందని వెలుగు చూసింది.

గుడిలో సింపుల్ గా పెళ్లి
బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం చెయ్యడానికి వచ్చిన కవితో ప్రేమలో పడిన సత్యా ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. కవిత మీద మోజు పడిన సత్యా ఐదు నెలల క్రితం గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. సత్యాతో పెళ్లి చేసుకోవడానికి కవిత కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసి వివాహం చేసుకున్న సత్యాతో కొత్తగా కాపురం పెట్టింది.

కొత్త ఫిగర్ ను తగులుకున్న మొగుడు
కవితను వివాహం చేసుకున్న ఆరు నెలల్లోనే భర్త సత్యాకు ఆమె పాతదైపోయిందని తెలిసింది. మూడు నెలల క్రితం అదే బ్యూటీ పార్లర్ లో పని చెయ్యడానికి వచ్చిన సింధు అనే అనే యువతితో తన భర్త సత్యా రొమాన్స్ చేస్తున్నాడని, సింధును నా భర్త పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని అతని భార్య కవిత ఆరోపిస్తున్నది.

నా భర్తకు అక్రమ సంబంధాలు
బ్యూటీ పార్లర్ లో పని చేసే అనేక మంది యువతులు, వివాహిత మహిళలతో తన భర్త సత్యా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్య కవిత ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇచ్చి అందమైన అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చెయ్యాలని తన భర్త సత్యా పక్కాప్లాన్ వేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని అతని భార్య కవిత ఆరోపిస్తోంది.

నా మొగుడు నన్ను తన్ని తరిమేశాడు
ప్రేమించిన వ్యక్తి సత్యాను పెళ్లి చేసుకోవడానికి తాను పుట్టింటి వాళ్లను ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చేశానని కవిత బోరున విలపిస్తోంది. కొత్త ప్రియురాలు సింధు మోజులో పడిన తన భర్త సత్యా తనను ఇంటి నుంచి బయటకు తన్నితరిమేశాడని, భర్త అతని కొత్త ప్రియురాలు సింధుతో కలిసి ఏకంగా బ్యూటీ పార్లర్ మేడ మీద కాపురం పెట్టేశాడని, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని కవిత విలపిస్తోంది.

పోలీసు కార్యాలయంలో పెట్రోల్ పోసుకున్న భార్య
నా భర్త సత్యా అనేక మంది మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని భార్య కవిత చెన్నైలోని అవడి అసిస్టెంట్ పోలీసు కమీషనర్ మహేష్ కార్యాలయం ముందు మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అక్కడి డ్యూటీ పోలీసులు కవిత శరీరం మీద నీళ్లు పోసి ఆమె నిప్పంటించుకోకుండా చర్యలు తీసుకుని ఆమెను ప్రాణాలతో కాపాడారు.

భర్త మీద కేసు పెట్టిన పోలీసులు
చెన్నైలోని అవడి అసిస్టెంట్ పోలీసు కమీషనర్ మహేష్ గంట సేపు కవితను విచారణ చేసి ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించారు. బ్యూటీ పార్లర్ ముసుగులో నా మొగుడు సత్యా అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుని అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని తాను ఇంతకు ముందే అంబత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానని, అక్కడి పోలీసులు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత అసిస్టెంట్ పోలీసుకు కమీషన్ మహేష్ ముందు బోరున విలిపించింది.

మొగుడు.... ప్రియురాలి మీద కేసు పెట్టిన భార్య
కవిత ఫిర్యాదు మేరకు ఆమె భర్త సత్యా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అవడి అసిస్టెంట్ పోలీసు కమీషనర్ మహేష్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తన భర్త సత్యా, ఆమె కొత్త ప్రియురాలు సింధు తనను చంపేస్తామని బెదిరించి ఇంటి నుంచి బయటకు గెంటేశారని కవిత కేసు పెట్టడం చెన్నైలో లకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications