Illegal affair: ఆంటీతో తండ్రి ఫుల్ టైమ్ ఎంజాయ్, విదేశాల నుంచి, ఫోన్ చేసి పిలిపించి ఫినిష్!
చెన్నై/తిరుచ్చి: పెళ్లి వయసుకు వచ్చిన ఇద్దరు కొడుకులు ఉన్న వ్యక్తి ఓ ఆంటీని తగులుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక కొడుకు విదేశాల్లో ఉండటంతో తండ్రి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. భార్యను పూర్తిగా పట్టించుకోవడం వదిలేసిన భర్త ఆంటీతో మస్త్ మజా చేస్తున్నాడు. విదేశాల నుంచి కొడుకు ఇంటికి వచ్చాడు ఎవడు వస్తే నాకేందుకు, ఎవడు పోతే నాకెందుకు ? అంటూ తండ్రి అతని ఆనందంలో అతను మునిగితేలుతున్నాడు. ఇంటికి రావాలని కొడుకులు అతని తండ్రికి ఫోన్ చేసి పిలిపించారు. ఏమిటి నీ కథ, ఆంటీతో ఫుల్ టైల్ ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తున్నావు ?, మా గురించి పట్టించుకోవా అంటూ కొడుకులు ప్రశ్నించారు.
ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. ఈ ప్రపంచంలో నా ప్రియురాలి కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అంటూ తండ్రి పాత సినిమా డైలాగులు చెప్పాడు. అంతే కొడుకులకు ఎక్కడో కాలిపోయి తండ్రిని నరికి చంపేయడం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా కన్న కొడుకుల చేతిలో తండ్రి దారుణ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఆంటీ మాయం అయిపోయింది.

ఇద్దరు కొడుకులు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని మన్నచనల్లూరు సమీపంలోని నెండగూరు ఎగువ వీధిలో సుబ్రమణ్యం (50), శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. 27 సంవత్సరాల క్రితం సుబ్రమణి, శాంతిల వివాహం జరిగింది. సుబ్రమణి, శాంతి దంపతులకు అరవింద్ కుమార్ (25), వినోద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

విదేశాల్లో పెద్ద కొడుకు
సుబ్రమణి, శాంతి దంతుల ఇద్దరు కుమారులు బాగా చదువుకున్నారు. అరవింద్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి మూడు సంవత్సరాల క్రితం వెళ్లాడు. అరవింద్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాధించి తల్లి శాంతికి పంపిస్తున్నాడు. వినోద్ మంచి ఉద్యోగం సంపాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆంటీని తగులుకున్న తండ్రి
అరవింద్ కుమార్ విదేశాలకు వెళ్లకముందే సుబ్రమణి ఓ ఆంటీతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. ఏడు సంవత్సరాల నుంచి సుబ్రమణికి, ఆంటీకి అక్రమ సంబందం ఉంది అయితే కొన్ని సంవత్సరాలు పాటు సుబ్రమణి అక్రమ సంబంధం విషయం బయటపడలేదు. పెళ్లి వయసుకు వచ్చిన ఇద్దరు కొడుకులు ఉన్న సుబ్రమణి ఆ ఆంటీని తగులుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్యను పట్టించుకోవడమే మానేశాడు
పెద్ద కొడుకు అరవింద్ కుమార్ విదేశాల్లో ఉండటంతో అతని తండ్రి సుబ్రమణి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. భార్య శాంతిను పూర్తిగా పట్టించుకోవడం మానేసిన సుబ్రమణి ఆంటీతో మస్త్ మజా చేస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి వారానికి ఒకసారి, లేదా రెండుసార్లు ఇంటికి వెలుతున్న సుబ్రమణి అతని భార్యతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు.

దీపావళి పండుగ కోసం విదేశాల నుంచి వచ్చిన కొడుకు
దీపావళి పండుగ కోసం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్ సొంత ఊరికి వెళ్లాడు. పండుగ అయిపోయినా కన్నతండ్రి సుబ్రమణి మాత్రం ఇంటికి రాకపోవడంతో అరవింద్ కుమార్ రగిలిపోయాడు. ఉద్యోగం చెయ్యడానికి మళ్లీ విదేశాలకు వెళ్లకుండా తన తండ్రి సుబ్రమణి సంగతి ఏమిటో తేల్చేయాలని అనుకున్న అరవింద్ కుమార్ పండుగ అయిపోయినా ఇక్కడే ఉండిపోయాడు.

తండ్రికి ఫోన్ చేసి పిలిపించుకున్న కొడుకులు
విదేశాల నుంచి పెద్ద కొడుకు అరవింద్ కుమార్ ఇంటికి వచ్చాడని తెలిసినా సుబ్రమణి చూడటానికి రాలేదు. ఎవడు వస్తే నాకేందుకు, ఎవడు పోతే నాకెందుకు ? అంటూ సుబ్రమణి ఆంటీతో ఎంజాయ్ చేస్తూ అతని ఆనందంలో అతను మునిగితేలుతున్నాడు. ఇంటికి రావాలని ఇద్దరు కొడుకులు సుబ్రమణికి ఫోన్ చేసి పిలిపించారు. ఏమిటి నీ కథ, ఆంటీతో ఫుల్ టైల్ ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తున్నావు ?, మా గురించి పట్టించుకోవా అంటూ అరవింద్ కుమార్, వినోద్ వారి తండ్రి సుబ్రమణిని ప్రశ్నించారు.

తండ్రి మీద రగిలిపోయిన కొడుకులు
ఆ సమయంలో సుబ్రమణి, అతని కొడుకుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఈ ప్రపంచంలో నా ప్రియురాలి కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అంటూ సుబ్రమణి పాత సినిమా డైలాగులు చెప్పాడు. అంతే సుబ్రమణి కొడుకులు వినోద్, అరవింద్ కుమార్ కు ఎక్కడో కాలిపోయింది. ఇనుప రాడ్లు తీసుకున్న అరవింద్ కుమార్, వినోద్ తండ్రి సుబ్రమణి మీద దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైనాయి.

ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
తీవ్రగాయాలైన సుబ్రమణిని వెంటనే శ్రీరంగం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. తరవాత అక్కడి నుంచి తిరుచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే సుబ్రమణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని డాక్టర్లు చెప్పారు. అక్రమ సంబంధం కారణంగా కన్న కొడుకుల చేతిలో సుబ్రమణి దారుణ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఆంటీ మాయం అయ్యింది. పోలీసులు వినోద్, అరవింద్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications