చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జుడిత్ రేవిన్ - ‘వణక్కం సౌత్ ఇండియా’ అంటూ బాధ్యతల్లోకి..

|
Google Oneindia TeluguNews

అమెరికా, దక్షిణభారతం మధ్య సంబంధాలు మరింత బలపడేలా తన వంతు కృషి చేస్తానని, కరోనా కష్టకాలంలో పరస్పర సహకారంతో ముందుకెళదామని జుడిత్ రేవిన్ అన్నారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులేట్ జనరల్ గా ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల్లో అత్యధికులు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావావడం, చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ కీలకంగా ఉంటుండటం తెలిసిందే.

చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ గా బాధ్యతల్లో చేరిన జుడిత్ రేవిన్ ఆదివారం విడుదల చేసిన వీడియోలో.. ''వణక్కం సౌత్ ఇండియా..'' అంటూ స్థానికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చెన్నై యూఎస్ కాన్సులేట్ పరిధిలోకి వచ్చే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలతో అమెరికా సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రయత్నం చేస్తానని జుడిత్ వీడియోలో పేర్కొన్నారు.

జుడిత్ రేవిన్ పదోన్నతిపై చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ గా చేరకముందు.. పెరూలోని యూఎస్ ఎంబసీలో పబ్లిక్ అఫైర్స్ కౌన్సిలర్ గా పనిచేశారు. అంతకుముందు, వాషింగ్టన్ డీసీలో హైతీ స్పెషల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల అధికారిణిగానూ విధులు నిర్వహించారు. గతంలో పాకిస్తాన్, డొమినికన్ రిపబ్లిక్, సుడాన్, కామెరూన్, మెక్సికోలోనూ దౌత్య అధికారిణిగా వివిధ స్థాయిల్లో పనిచేశారు.

JUDITH RAVIN TAKES LEADERSHIP AS U.S. CONSUL GENERAL IN CHENNAI

2003లో యూఎస్ విదేశాంగ శాఖలో చేరడానికి ముందు కూడా జుడిత్ రేవిన్.. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో జర్నలిస్టుగా, ట్రాన్స్ లేటర్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. అమెరికా సహా ఫ్రాన్స్, స్పెయిన్ లోని పలు యూనివర్సిటీల్లో ఆమె చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రోమన్ భాషలపై మాస్టర్స్ పూర్తి చేశారు. స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడుతారు. జర్నలిస్టుగా, దౌత్య అధికారిణిగా తనకున్న అనుభవంతో జుడిత్ రేవిన్ రెండు పుస్తకాలకు సహచరయితగా వ్యవహరించారు. ఆమె రాసిన ''Beyond Our Degrees of Separation: Washington Monsoons and Islamabad Blues (2017)'', ''Ballet in the Cane Fields: Vignettes from a Dominican Wanderlogue (2014)'' పుస్తకాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

English summary
Ms. Judith Ravin has assumed the post of Consul General of the United States of America in Chennai as of September 6, 2020. “It is my great privilege to represent the United States in South India, especially at this historically difficult time of the COVID-19 pandemic,” said Consul General Ravin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X