భార్యకు ?, తన్ని తరిమేశాడు, 20 మందితో కలిసి కొడునుకు కిడ్నాప్ చేశాడు. క్లైమాక్స్ లో!
చెన్నై/ కన్యాకుమారి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. రానురాను భార్య తీరుపై ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు జరిగాయి. విసిగిపోయిన భర్త అతని భార్యను గాలికి వదిలేసి అతని దారి అతను చూసుకున్నాడు. తరువాత అసలు స్టోరీ మొదలైయ్యింది.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని జిల్లాలోని మక్కా మండపం సమీపంలో తండ్రి అపహరణకు గురైన మూడేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. బాలుడిని కిడ్నాప్ చేసింది అతని తండ్రే అని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. భార్య మీద పగ తీర్చుకోవడానికి కన్న కొడుకును కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

కన్యాకుమారి జిల్లా మెక్క మండపం పక్కనే ఉన్న బిలంగలై ప్రాంతానికి చెందిన బిపిన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ప్రియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న బిపిన్, ప్రియా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. బిపిన్, ప్రియా దంపతులకు 3 ఏళ్ల వయసు ఉన్న అద్విక్ అనే కుమారుడు ఉన్నాడు. కడమలైక్కున్ను ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో అద్విక్ ను బేబి సిట్టింగ్ క్లాస్ లో చేర్పించారు.
ఈ క్రమంలో కారులో పాఠశాలకు వెళ్తున్న అద్విక్ ను ద్విచక్రవాహనాలు, కార్లలో వచ్చిన 20 మందితో కూడిన ముఠా అపహరించుకుపోయింది. పట్టపగలు జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. అద్విక్ తల్లి ప్రియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అద్విక్ కిడ్నాప్ అయ్యాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అద్విక్ తల్లిదండ్రులు బిపిన్, ప్రియా అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియాకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త బిపిన్ కు అనుమానం ఉందని పోలీసులు అన్నారు. ఈ క్రమంలోనే అద్విత్ తల్లి ప్రియా కూడా ఆమె భర్త బిపిన్ తన కుమారుడిని అపహరించాడని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు నాగర్‌కోయిల్ సమీపంలోని బిపిన్ స్నేహితుడి ఇంటిలో అద్విక్ ఉన్నాడని తెలుసుకున్నారు.
అద్విక్‌ను సురక్షితంగా రక్షించిన పోలీసులు ఆ బాలుడి తండ్రి బిపిన్ ను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ప్రియా మీద కోపంతో తన కుమారుడు అద్విక్ ను కిడ్నాప్ చేశానని బిపిన్ అంగీకరించాడని, ఈ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని కన్యాకుమారి జిల్లా పోలీసులు తెలిపారు. కన్న కొడుకును అతని తండ్రి కిడ్నాప్ చెయ్యడం కన్నాకుమారి జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications