Learder: రూ. కోట్లలో బంగారు కొన్నారని, మాజీ ఆరోగ్య శాఖా మంత్రికి ఈడీ కష్టాలు, లేడీ ఇచ్చిన క్లూతో !
చెన్నై/కొచ్చి: కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసిన ఆ లీడర్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ప్రజలను అప్రమత్తం చేశారని, లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సహాయం చెయ్యడానికి ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చారని అప్పటి ఆరోగ్య శాఖా మంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. ప్రభుత్వం మారిన తరువాత ఇప్పుడు ఆయన మాజీ మంత్రి అయ్యారు. ఇదే సమయంలో అక్రమంగా ఓ సంస్థ నుంచి కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ మాజీ ఆరోగ్య శాఖా మంత్రికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోని ఆభరణాల సంస్థకు, మాజీ మంత్రికి పరిచయం చేసిన ఓ మహిళ ఈడీ అధికారుల చేతికి చిక్కడంతో ఇప్పుడు మాజీ ఆరోగ్య శాఖా మంత్రి, ఆయన భార్య చిక్కుల్లో పడ్డారు. మాజీ మంత్రి ఆయన దగ్గర ఉన్న బ్లాక్ మనీతో కోట్ల రుపాయాల విలువైన బంగారు నగలు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అన్నాడీఎంకేలో పవర్ ఫుల్ లీడర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా సి. విజయ్ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సి. విజయ్ భాస్కర్ మంత్రి అయ్యారు. జయలిలత మరణించిన తరువాత కూడా అనేక మందికి మంత్రి పదవులు ఊడిపోయినా సి. విజయ్ భాస్కర్ మంత్రి పదవి పదిలంగానే ఉండిపోయింది.

మంచి పేరు తెచ్చుకున్న విజయ భాస్కర్
గత ఏడాది కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోయిన విషయం తెలిసిందే. భారతదేశంతో కూడా కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్నం చేసింది. తమిళనాడులో మొదట కరోనా వైరస్ దెబ్బతో ప్రజలు హడలిపోయారు. తమిళనాడులో కరోనా వైరస్ దెబ్బతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చనిపోయారు. కరోనా వైరస్ అరికట్టడంతో అప్పటి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సి. విజయ భాస్కర్ శక్తి వంచన లేకుండా పని చేశారని మంచి పేరు ఉంది.

ఆకాశానికి ఎత్తేశారు
కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసిన సి. విజయ భాస్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి అప్పటి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ప్రజలను అప్రమత్తం చేశారని, లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సహాయం చెయ్యడానికి ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చారని ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తరువాత తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయ్ భాస్కర్ మాజీ మంత్రి అయ్యారు.

కేరళలో అక్రమంగా బంగారు కొన్నారని సమన్లు
కేరళకు చెందిన ఓ ఆభరణాల సంస్థ నుంచి అక్రమంగా కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ తమిళనాడు మాజీ ఆరోగ్య శాఖా మంత్రి సి. విజయ భాస్కర్ కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి సోమవారం కేరళలోని కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను విచారణ చేస్తున్నారు.

మహిళ ఇచ్చిన సమాచారంతో ?
కేరళ రాష్ట్రంలోని ఆభరణాల సంస్థకు, మాజీ మంత్రి విజయ భాస్కర్ కు పరిచయం చేసిన కేరళలోని అలప్పుజకు చెందిన ఓ మహిళ ఈడీ అధికారుల చేతికి చిక్కడంతో ఇప్పుడు మాజీ ఆరోగ్య శాఖా మంత్రి, ఆయన భార్య చిక్కుల్లో పడ్డారు. అలప్పుజకు చెందిన మహిళ తమ దగ్గర బంగారు నగలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదని ఆ ఆభరణాల సంస్థ ఫిర్యాదు చెయ్యడంతో ఆ మహిళ పేరు తెర మీదకు వచ్చింది.
Recommended Video

లేడీకి మాజీ మంత్రి రూ. 2.50 కోట్లు కమీషన్ ఇచ్చారని ?
ఆభరణాల సంస్థకు పరిచయం చేసినందుకు తనకు మాజీ మంత్రి రూ. 2. 50 కోట్లు కమీషన్ ఇచ్చారని ఆ మహిళ అధికారులకు చెప్పిందని తెలిసింది. అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ చెన్నై, పుదుక్కోటైలోని తమిళనాడు మాజీ మంత్రి సి. విజయ భాస్కర్ ఇంటి మీద ఆయన బంధువుల నివాసాల్లో అక్టోబర్ 18వ తేదీన డీవీఏసీ ( అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి విజయ్ భాస్కర్ విషయంలో ఈడీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో ఆయనతో పాటు ఆయన వర్గీయులు హడలిపోతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications