Lovers: ఎంజాయ్ చేసిన ప్రేమికులు, స్పాట్ లోనే అమ్మాయికి కత్తిపోట్లు, భయంతో ఆత్మహత్య, టార్చర్ !
చెన్నై/ సేలం: ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రియుడు కొంతసేపు ఎంజాయ్ చేశాడు. తరువాత ప్రియురాలు, ప్రియుడు గొడవపడ్డారు. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన ప్రియుడు కత్తి తీసుకుని స్పాట్ లోనే ప్రియురాలిని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులు, కుటుంబ సభ్యులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని భయపడిన ప్రియుడు డెత్ నోట్ రాసి జోబులో పెట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నై చర్చిలో కారు డ్రైవర్
తమిళనాడులోని కల్లకూరిచి జిల్లాలోని చిన్నసలేం సమీపంలోని తోటియం ప్రాంతంలో నివాసం ఉంటున్న సతీష్ (30) అనే యువకుడు చెన్నైలోని వేలాచ్చేరి ప్రాంతంలోని ప్రముఖ చర్చిలో కారు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న చోట, చర్చి పెద్దల దగ్గర సతీష్ కు మంచిపేరు ఉందని తెలిసింది.

మైనర్ తో ప్రేమాయణం
తమిళనాడులోని సేలంకు చెందిన 16 ఏళ్ల బాలికతో సతీష్ కు పరిచయం ఉంది. గత రెండు సంవత్సరాల నుంచి సతీష్, ఆ యువతి కలిసి తిరుగుతున్నారు. వీలుచిక్కిప్పుడల్లా సతీష్, బాలిక నిర్జనప్రదేశాల్లోకి వెళ్లి ఏకాతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరూ ఇలా కలిసి తిరుగుతున్నారు.

ప్రియురాలిని స్పాట్ లో పొడిచేశాడు
ప్రతిరోజూ సతీష్ అతని ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఆదివారం పని ముగించుకున్న సతీష్ సేలం వెళ్లాడు. తరువాత ప్రియురాలితో కలిసి సతీష్ వారు నిత్యం కలుసుకునే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో ఏదో విషయంలో సతీష్, అతని ప్రియురాలి మద్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన సతీష్ కత్తి తీసుకుని ఎక్కడ కలుసుకున్నారో అక్కడే ప్రియురాలిని ఇష్టం వచ్చినట్లు పొడిచేసి చంపేయడానికి ప్రయత్నించాడు.

భయంతో ప్రియుడి ఆత్మహత్య
ప్రియుడు కత్తితో దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన ప్రియురాలిని కల్లకూరిచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సతీష్ తనను కత్తితో పొడిచి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని బాలిక పోలీసులకు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న సతీష్ భయంతో సేలం సమీపంలోని ఉదయపట్టి బైపాస్ రోడ్డు సమీపంలోని పెరుమాల్ కోవిల్మేడ్ ప్రాంతంలోని దట్టమైన పొదల్లోని చెట్టుకు ఆదివారం అర్దరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

టార్చర్ పెట్టింది... అందుకే !
సోమవారం విషయం తెలుసుకున్న సేలంలోని అమ్మాపేటై పోలీస్ ఇన్స్ పెక్టర్ రాజా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు సతీష్ ఓ డెత్ నోట్ రాసి అతని జోబులో పెట్టుకున్నాడని పోలీసులు అన్నారు. తన ప్రియురాలు తనను టార్చర్ పెట్టిందని, అందుకే కత్తితో పొడిచి పారిపోయానని సతీష్ డెత్ నోట్ లో రాసిపెట్టాడని పోలీసులు అన్నారు. సతీష్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications