MLA love story: హైకోర్టులో పెళ్లి కూతురు సౌందర్య వివరణ, సౌందర్యలహరి, స్వప్నసుందరి డ్యూయెట్ !
చెన్నై/ మదురై: కాలేజ్ అమ్మాయిని ప్రేమించి కులాతంర వివాహం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశారు. సౌందర్యలహరి స్వప్నసుందరి అంటూ ఆ ఎమ్మెల్యే పాటలు పాడుకున్నాడు. మా ఇంటికి వచ్చి వెలుతూ మా అమ్మాయిని పరిచయం చేసుకుని తీరా ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. మేము ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నామని ఎమ్మెల్యే ప్రభు ఓ వీడియో విడుదల చేశాడు, పెళ్లి కొడుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో వివాదం ముదిరిపోయింది. శుక్రవారం హైకోర్టు ముందు హాజరైన పెళ్లి కూతురు అసలు ఏం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్లు న్యాయస్థానం ముందు వివరించింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే లవ్ స్టోరీ
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ (AIADMK) కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు ఏంఏ చదువుతున్న సౌందర్య అనే కాలేజ్ అమ్మాయిని ప్రేమించాడు. తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంటిలోనే ఆయన పెళ్లి సౌందర్యతో జరిగింది. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం సింపుల్ గా జరిగింది. అయితే ఈ పెళ్లికి పెళ్లి కుమార్తె సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు. ఎమ్మెల్యే ప్రభు పెళ్లి రోజే పెళ్లి కూతురు తండ్రి స్వామినాథన్ శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

ఖర్మకాలి ఎమ్మెల్యే అయ్యాడు
మా ఇంటికి ఎమ్మెల్యే ప్రభు గత 14 ఏళ్లుగా వచ్చి వెలుతున్నాడని, అలా మా కుటుంబ సభ్యులకు అతనికి పరిచయం ఉందని సౌందర్య తండ్రి స్వామినాథన్ అన్నాడు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభుకు 39 ఏళ్లు, తన కుమార్తె సౌందర్యకు 19 ఏళ్లు, ఇద్దరి మద్య 20 ఏళ్ల తేడా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి స్వామినాథన్ ఆరోపించారు. తన కుమార్తెను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని ఎమ్మెల్యే ప్రభు మీడియాకు చెప్పాడు, అంటే తన కుమార్తెకు 9 ఏళ్లు వయసు ఉన్నప్పటి నుంచి అతను ప్రేమిస్తున్నాడా ?, అదిసాధ్యం అవుతుందా ?, 9 ఏళ్ల అమ్మాయిని ప్రేమించిన వాడు మన ఖర్మకాలి ఎమ్మెల్యే అయ్యాడని సౌందర్య తండ్రి స్వామినాథన్ విమర్శించాడు.

హైకోర్టుకు అమ్మాయి తండ్రి
తన కుమార్తె సౌందర్యను ప్రభు కిడ్నాప్ చేశాడని, బెదిరించి వారి కుటుంబ సభ్యుల సమక్షంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నాడని, తన కుమార్తెను తనకు అప్పగించాలని సౌందర్య తండ్రి స్వామినాథన్ చెన్నై హై కోర్టు (మద్రాసు హైకోర్టు)ను ఆశ్రయించాడు. మా అమ్మాయి సౌందర్యకు 19 ఏళ్లు మాత్రమే, ఆమెను కిడ్నాప్ చేసి బెదిరించి ఎమ్మెల్యే ప్రభు పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి స్వామినాథన్ కోర్టుకు చెప్పారు.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వీడియోలు వైరల్
మేము ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నామని, నేను ఎవ్వరినీ కిడ్నాప్ చెయ్యలేదని ఎమ్మెల్యే ప్రభు రెండు రోజుల క్రితం విడుదల చేసిన వీడియోను ఆయన తరుపు న్యాయవాదులు కోర్టులో సమర్పించారు. అంతే కాకుండా పెళ్లి కుమార్తె సౌందర్య కూడా వేరుగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియెను సైతం ఎమ్మెల్యే ప్రభు న్యాయవాదులు హైకోర్టులో సమర్పించారు. మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ లు కేసు వివరాలు తెలుసుకున్నారు. వాదనలు విన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పెళ్లి కుమార్తె సౌందర్యను కోర్టు ముందు హాజరుపరచాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

చేతులు దులుపుకున్న పోలీసులు
హైకోర్టు ఆదేశాలతో పోలీసు అధికారులు ఎమ్మెల్యే ప్రభు భార్య సౌందర్యను హైకోర్టు ముందు హాజరుకావాలని సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రభుతో పాటు ఆయన భార్య సౌందర్య చెన్నైలోని మద్రాసు హైకోర్టుకు చేరుకున్నారు. తరువాత సౌందర్య మాత్రమే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ ముందు హాజరైయ్యింది. హైకోర్టు ముందు సౌందర్యను హాజరుపరిచిన పోలీసులు హమ్మయ్యా అంటూ చేతులు దులుపేసుకున్నారు.
Recommended Video

పెళ్లి కూతురికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తనను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని, తన ఇష్టప్రకారం పెళ్లి జరిగిందని, తానే మేజర్ అని, తాను కోరుకున్న వ్యక్తితో జీవించడానికి మీరు అనుమతి ఇవ్వాలని పెళ్లి కూతురు సౌందర్య న్యాయమూర్తులకు మనవి చేసింది. తనను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని, ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని సౌందర్య చెప్పడంతో ఆమె స్టేట్ మెంట్ ను హైకోర్టు రికార్డు చేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుతో కలిసి జీవించడానికి సౌందర్యకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొడుకు అనుకుంటే కొంప ముంచేశాడు
తాను ప్రేమ పెళ్లికి వ్యతిరేకం కాదని, తనకు కులం, మతం అని తేడా లేదని పెళ్లి కుమార్తె తండ్రి స్వామినాథన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే ప్రభుని తాను కొడుకులాగా భావించానని, అలాగే అతను ఇంటికి వచ్చినా గుడ్డిగా నమ్మానని, అయితే తనకే నామం పెడతాడని ఊహించలేదని, కొడుకు అనుకుంటే నా కొపం ముంచేశాడని స్వామినాథన్ విచారం వ్యక్తం చేశాడు. తన కుమార్తె సౌందర్యకు, ఎమ్మెల్యే ప్రభుకు వయసులో 19 ఏళ్లు తేడా ఉందనే ఒకేఒక్క కారణంతో తాను ఈ పెళ్లిని వ్యతిరేకించానని, తనకు కుల పిచ్చి లేదని స్వామినాథన్ విలపించాడు. మొత్తం మీద పెళ్లి కూతురు సౌందర్య వివరణతో స్వామినాథన్ వేసిన పిటిషన్ విచారణ హైకోర్టులో పూర్తి అయ్యింది
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications