చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chennai: లిక్కర్ ఎఫెక్ట్, పోలీసు ఔట్ పోస్ట్ ద్వంసం చేసిన తాగుబోతులు, ఎందుకంటే ?, సీసీటీవీల్లో !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎండా, వానలో పోలీసులు విధులు నిర్వహించడానికి పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. రాత్రి విధులు పూర్తి చేసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లిపోయారు. పోలీసు ఔట్ పోస్టు సమీపంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అర్దరాత్రి దాటిన తరువాత కొందరు పీకలదాక మద్యం సేవించి పోలీసు ఔట్ పోస్టు ధ్వంసం చెయ్యడం కలకలం రేపింది. సీసీటీవీల దెబ్బతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!

 పోలీసు ఔట్ పోస్టు ధ్వంసం

పోలీసు ఔట్ పోస్టు ధ్వంసం

చెన్నై సిటీలోని పాండి బజార్ లోని వాణి మహల్ ఏరియాలో స్థానిక పోలీసులు పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. రాత్రి విధులు పూర్తి చేసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లిపోయారు. పోలీసు ఔట్ పోస్టు సమీపంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో కొందరు పోలీసు ఔట్ పోస్టు మీద రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేశారు

సీసీటీవీ కెమెరాలు

సీసీటీవీ కెమెరాలు

శనివారం ఉదయం విదులు నిర్వహించడానికి పోలీసులు వెళ్లి చూస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. పాండి బజార్ రోడ్డులో డ్రైనేజ్ నిర్మించడానికి కాంట్రాక్టర్ లోగనాథన్ సిమెంట్, కంకర, ఇనుప రాడ్లు ఆ ప్రాంతంలో నిల్వచేశాడు.

కాంట్రాక్టర్ ను బెదిరించాలని ?

కాంట్రాక్టర్ ను బెదిరించాలని ?

శనివారం వేకువ జామున 10 మంది మద్యం సేవించి అక్కడ సిమెంట్, ఇనుప రాడ్లు చోరీ చెయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో కాంట్రాక్టర్ లోగనాథన్ వాళ్లను మందలించి నాలుగు దెబ్బలు వేశాడు. ఆ సందర్బంలో నిందితులు లోగనాథన్ మీద రాళ్లు వర్షం కురిపించారని, తప్పించుకోవడానికి ప్రయత్నించిన లోగనాథ్ పోలీసు ఔట్ పోస్టులో దాక్కొన్నాడని పోలీసులు అన్నారు.

మందుబాబుల దెబ్బతో

మందుబాబుల దెబ్బతో

ఆ సందర్బంలో నిందితులు లోగనాథన్ ను బయటకు లాగాలని పోలీసు ఔట్ పోస్టు మీద దాడి చేశారని పోలీసులు అన్నారు, సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద పోలీసు ఔట్ పోస్టును మందుబాబులు ద్వంసం చేశారని వెలుగు చూడటంతో చెన్నై సిటీలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Pondy Bazaar police booth vandalised by group of drunk men in Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X