చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Super Sir: కో వ్యాక్సిన్, ఆక్సిజన్ బ్లాక్ లో అమ్మితే ? రేయ్...వనక్కమ్ అని వదిలేస్తారా, లేదురా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో అనేక రంగాల్లో బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. నిత్యవసర వస్తువులు, ప్రజలను కాపాడే మందులలతో పాటు చివరికి కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, మెడికల్ ఆక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయించి ప్రజల రక్తం పీల్చేస్తున్నారు. కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే చూస్తూ వనక్కమ్ అని వదిలేస్తామని అనుకుంటున్నారా ?, అక్కడ ఉండేది స్టాలిన్ రా..... జాగ్రత్తా అంటున్నారు పోలీసు అధికారులు. కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, ఆక్సిజన్ ఇక బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కండి అంటూ సీఎం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

MK Stalin - Kabali Daa బొక్కలో వేసి మక్కెలు ఇరగదియ్యాలని ఆదేశాలు..! || Oneindia Telugu

Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !

అన్నీ ఆలోచించి డిసైడ్

అన్నీ ఆలోచించి డిసైడ్

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చెయ్యాలని, రాష్ట్రానికి లాభం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ సంచలన నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

జోరుగా బ్లాక్ మార్కెట్ దందా


ఇదే సమయంలో కోవ్యాక్సిన్, రెమిడెసివర్, ఆక్సిజన్ లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే దందా తెర మీదకు వచ్చింది. అమాయకుల ప్రాణాలు పెట్టుబడిగా చేసుకున్న ముఠాలు ప్రజల అవరసరాలను బట్టి 10 రెట్లు ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ అప్పనంగా డబ్బులు సంపాధిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో సామాన్య ప్రజల జోబులు చిల్లులు పడుతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కు సమాచారం వెళ్లింది.

బొక్కలో వేసి కుమ్మేయండి

బొక్కలో వేసి కుమ్మేయండి

కోవ్యాక్సిన్, రెమిడెసివర్, ఆక్సిజన్ లు బ్లాక్ మార్కెట్ లో ఎవరు విక్రయించినా సరే వారి మీద గూండా చట్టం కింద కేసులు నమోదు చేసి బొక్కలో వేసి మక్కిలు ఇరగదియ్యాలని, ఎవ్వరిని వదిలిపెట్టకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఆ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుండా యాక్ట్ కింద కేసులు నమోదు అయితే అంత సామాన్యంగా బెయిల్ చిక్కదు.

సూపర్ సీఎం.... గ్రేట్ సార్

సూపర్ సీఎం.... గ్రేట్ సార్

తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 వనక్కమ్ అని వదిలేస్తారా రా ? అక్కడ ఉండేది స్టాలిన్ రా

వనక్కమ్ అని వదిలేస్తారా రా ? అక్కడ ఉండేది స్టాలిన్ రా

ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాలోని డైలాగ్ లను గుర్తు చేస్తున్నారు తమిళనాడు ప్రజలు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తామని అంటుంటే చూస్తూ చేతులు కట్టుకుని కుర్చోవడానికి. మీకు వనక్కం అంటూ వదిలేయడానికి అక్కడ ఉండేది ఎవరో కాదు.... స్టాలిన్, సీఎం మీ చీటి చినిగిపోతుంది జాగ్రత్త అంటూ డీఎంకే కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ దందా బ్యాచ్ లకు వార్నింగ్ ఇస్తున్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాలతో పోలీసులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

English summary
Super Sir: Amidst reports about individuals hoarding Remdesivir injection, Chief Minister MK Stalin on Saturday directed police department to book those who hoard Remdesivir, oxygen cylinders and sell them at exorbitant prices under the Goondas Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X