మెదీ ప్రభుత్వం పోతే మనం హ్యాపీగా ఉంటాము, ఆ పని చెయ్యాలని సీఎం పిలుపు!

చెన్నై/ తిరువారూరు: తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించి కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దింపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తిరువారూరులో అన్నారు. తిరువారూరులో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారక చిహ్నం కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవంలో స్టాలిన్ మాట్లాడారు.

మనం ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నామని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎ స్టాలిన్ అన్నారు. అలా చేయడంలో విఫలమైతే 3, 000 నుండి 4, 000 సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళనాడు నాశనం అవుతుందని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలో కొనసాగిస్తే తమిళనాడు, తమిళులు, భారతదేశ భవిష్యత్తుకు హానికరంగా మారు తుందని తమిళనాడు సీఎం ఎంకే, స్టాలిన్ ఆరోపించారు.

Tamil Nadu CM MK Stalin called to change the BJP government at the centre

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తులు అందరూ ఏకమైనట్లే, జాతీయ స్థాయిలోనూ అదే రకమైన ఐక్య కార్యాచరణ మరియు సమన్వయం ప్రతిరూపం కావాలి. మనం గెలవాలి అంటే ముందు ఐక్యత కావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో బీహార్ ముందుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.

జూన్ 23న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపునిచ్చిన లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమావేశం జరగనుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీయేతర పార్టీల సమావేశానికి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశంలో పదేళ్ల బీజేపీ పాలనలో చెలరేగిన మంటలను ఆర్పాల్సిన బాధ్యత మనపై ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.

మీ ఆశీస్సులు మాకు కావాలని, మనం లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుదాం అని, భారతదేశ భవిష్యత్తును మనం నిర్ణయిద్దామని స్టాలిన్ తమిళ ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి గొప్ప జాతీయ రాజకీయ నేత అని ఎంకే స్టాలిన్ కొనియాడారు. అప్పట్లో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులతో కరుణానిధికి మంచి సంబంధాలుండేవి, దేశంలో పెను రాజకీయ మార్పులు, ప్రభుత్వాల మార్పులకు ఆయనే కారణమని తమిళనాడు సీఎం ఎంకే, స్టాలిన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+