మూడు రోజుల క్రితం పెళ్లి, బెడ్ రూమ్ లోకి వెళ్లిన కొత్త పెళ్లికూతురు ఏం చేసిందంటే, షాక్ !

చెన్నై/కరూర్: ఒకే ప్రాంతంలో యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి యువతి, యువకుడికి పరిచయం ఉంది. ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయితే యువతి, యువకుడు ప్రేమించుకోలేదు. పెద్దలు మాట్లాడుకుని యువతి, యువకుడి పెళ్లి జరిపించారు. వివాహం జరిగిన మూడు రోజులకే కొత్త పెళ్లికూతురు బెడ్ రూమ్ లో శవమై కనిపించడం కలకలం రేపింది.

తమిళనాడులోని కరూర్ జిల్లా కృష్ణరాయపురం సమీపంలోని చిన్నకినాథుపట్టిలో అళగరస్వామి (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అళగరస్వామి కుమార్తె రమ్యాకు, అదే ప్రాంతానికి చెందిన జగదీస్ అనే యువకుడికి మూడు రోజుల క్రితం పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లి గ్రాండ్ గానే జరిగింది. పెళ్లి సమయంలో పెళ్లికూతురు రమ్యా అందరితో చాలా సంతోషంగా ఉందని తెలిసింది.

The bride committed suicide three days after the wedding near Karur in Tamil Nadu.

వివాహం జరిగిన తరువాత రమ్యా అత్తారింటికి వెళ్లింది. రెండు రోజుల పాటు బర్త జగదీష్ తో కలిసి అత్తారింటిలో రమ్యా చాలా సంతోషంగా ఉందని సమాచారం. శుక్రవారం పెళ్లిజరిగిన మూడో రోజు నవవధువు రమ్యా ఆమె భర్త జగదీష్ తో కలిసి తల్లి ఇంటిలో జరుగుతున్న వింధు భోజనాలకు వెళ్లింది. రాత్రి బంధువులు, కుటుంబ సభ్యులు వింధు భోజనం హడావిడిలో ఉన్న సమయంలో రమ్యా ఇంట్లోని బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రమ్యా ఎంతసేపటికీ రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రమ్యా ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించింది. దీంతో షాక్ తిన్న బంధువులు మాయనూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రమ్యా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పెళ్లయిన మూడు రోజులకే రమ్యా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+