భారీ వర్షాల దెబ్బకు సీఎం నిర్ణయం ఇదే, అన్ని మూసేయండి అంటూ ఆదేశాలు!

చెన్నై/కాంచీపురం: చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం సౌత్ జోన్ చీఫ్ బాలచంద్రన్ ఇప్పటికే చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో మారిన పరిస్థితుల కారణంగా దాని ప్రభావంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే బాలచంద్రన్ చెప్పారు.

The Tamil Nadu government announced a holiday for educational institutions in five districts including Chennai due to heavy rains

చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నైలో పగలంతా భారీ వర్షం పడుతోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చెన్నైతో పాటు కొనసాగింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు సైతం జలమయం అయ్యాయి. కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో విద్యాసంస్థలు అన్నింటికి సెలవు ప్రకటిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చెన్నై సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని మురికివాడల్లో నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరిలి వెలుతున్నారు. మురికివాడల్లో నివాసం ఉంటూ ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్న ప్రజలను ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

The Tamil Nadu government announced a holiday for educational institutions in five districts including Chennai due to heavy rains

తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెట్లు కుప్పకూలిపోయి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాట కారణంగా రోడ్లు మీద భారీగా నీరు నిలిచిపోవడంతో ఆ నీరు తొలగించడానికి సంబంధిత అధికారులు, సిబ్బంది అనేక చర్యలు తీసుకుంటున్నారు.

విద్యత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరా చెయ్యడానికి ఆ శాఖ అధికారులు, సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద చెన్నై సిటీతో పాటు ఐదు జిల్లాల్లో వానదేవుడు తన ప్రతాపం చూపించడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+