చెన్నై మెరీనా బీచ్‌ ఎయిర్ షోలో విషాదం: తొక్కిసలాటలో ఐదుగురు మృతి, వందల మందికి గాయాలు

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన మెగా ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడినట్లు సమాచారం. తీవ్ర రద్దీ, ఉక్కపోత కారణంగా పలువురు సొమ్మసిల్లిపడిపోయారు.

ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు, పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మృతుల దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Tragedy at Chennai Marina Beach Air Show Four killed in stampede

మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్ గా గుర్తించారు. డీహైడ్రేషన్ కారణంగా దాదాపు 265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఐఏఎఫ్ తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఎయిర్ షోను నిర్వహించింది.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ.. సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. 13 లక్షల మందికిపై ప్రజలు రైలు, మెట్రో, కార్లు, బస్సులు, ఇతర వాహనాల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనను తిలకించారు. కాగా, ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌కు ఒక్కసారిగా వేలాది మంది చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రాణ నష్టం జరిగింది. ఐదుగురు మృతి చెందడంతోపాటు వందలాది మంది గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన పోలీసు, ఇతర శాఖల అధికారులు వెంటనే గాయపడినవారిని, అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రులకు తరలించారు.

ఆకట్టుకున్న ఎయిర్ షో: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

మెరీనా బీచ్‌లో భారత వాయుసేన ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది.
వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ అమర్‌దీప్‌సింగ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు, చెన్నై మేయర్‌ ప్రియ తదితరులు ఈ విన్యాసాలను తిలకించారు. వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో మెరినా బీచ్‌ కిక్కిరిసిపోయింది. ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని వాయుసేన సాహసోపేత విన్యాసాలను ప్రజలు వీక్షించారు.

వాయుసేనకు చెందిన స్పెషల్‌ గరుడ్‌ ఫోర్స్‌ కమెండోల పరాక్రమంతో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బందీలను విడిపించటంలో వాయుసేన తమ సాహసోపేత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పారాజంప్‌ ఇన్‌స్ట్రక్టర్లు నిర్దేశిత ప్రదేశంలో ల్యాండయ్యారు. లక్షిత ప్రాంతాన్ని చేరుకోవడానికి కమాండోలు దూసుకెళ్లిన తీరు విశేషంగా ఆకట్టుకుంది.

సూపర్‌ సోనిక్‌ రఫేల్‌ జెట్‌ఫైటర్లతోపాటు 50 యుద్ధ విమానాలు గగనతలంలో నిప్పుల వర్షం కురిపించాయి. హెరిటేజ్‌ ఫైటర్‌ జెట్‌ డకోట, హార్వర్డ్‌, తేజస్‌, సుఖోయ్‌-30, సారంగ్‌ హెలికాప్టర్లు గగనతలం నుంచి చేసిన సెల్యూట్‌ సందర్శకులను ఆకట్టుకుంది. దాదాపు 72యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దీంతో ఈ విన్యాసాలకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్స్‌లో చోటు దక్కనుంది.

డకోటా యుద్ధవిమానం చేసిన విన్యాసాలను సందర్శకులు కనురెప్ప కొట్టకుండా వీక్షించారు. సారంగ్‌ హెలికాప్టర్ల బృందం చేసిన విన్యాసాలు ఉత్కంఠభరితంగా సాగాయి. వాయుసేన వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వైమానిక ప్రదర్శన రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించటం ఇది మూడోసారి. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జరగ్గా, అంతకుముందు ఏడాది చండీగఢ్‌లో నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక విన్యాసాలు జరిగడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+