మోదీ, షాకు మోకరిల్లారు -తమిళనాడు సీఎం పళని తీరును సహించలేకపోతున్నా: రాహుల్ గాంధీ
తమిళనాడుకు తనకంటూ గొప్ప సంస్కృతి, ఉత్కృష్టమైన వారసత్వం ఉందని, అలాంటి సంస్కృతిలో పుట్టిపెరిగిన పళనిస్వామి ఇవాళ మోదీ, అమిత్ షాల ముందు మోకరిల్లడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మోకరిల్లేలా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేశారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి వారిద్దరి ముందూ మోకరిల్లేలా, పాదాలు మొక్కేంతలా తయారు చేసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

''అమిత్‌షాకు ఓ ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కే ఫొటో ఒకటి నేను చూశా. బీజేపీలో సాధ్యమిది. మీరు బీజేపీ నేతల పాదాలను తాకాలి. మోదీ,షా ముందు మోకరిల్లాలి. తమిళనాడు సీఎం పళని స్వామిని కూడా వారలా చేస్తున్నారు. సీఎంను వారిద్దరూ కంట్రోల్ చేస్తున్నారు. అమిత్‌షా ముందు మోకరిల్లే అవసరమేమీ లేదు. కానీ సీఎం అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అలా చేస్తున్నారు.'' అంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంతో కలిసి పోటీచేస్తుండగా, కమ్యూనిస్టులు, వీసీకే తదిర పార్టీలూ కూటమిలో ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత సీఎం అయిన పళనిస్వామి.. బీజేపీకి దగ్గరవుతూ ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications