• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడే శశికళ విడుదల... భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా? తమిళ పాలిటిక్స్‌‌లో ఉత్కంఠ?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి,అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకె నాయకురాలు వీకె శశికళ బుధవారం(జనవరి 27) జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే విడుదలకు సంబంధించిన పత్రాలను కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు సిద్దం చేశారు. ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళతో విడుదలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. జైలు నుంచి విడుదలైనప్పటికీ శశికళ బెంగళూరు ఆస్పత్రిలోనే మరికొద్దిరోజులు చికిత్స పొందుతారా లేక చెన్నైకి బయలుదేరుతారా అన్న దానిపై స్పష్టత రానుంది.

ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

శశికళ విడుదల సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు ఆమె మద్దతుదారులు,అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం కార్యకర్తలు సిద్దమయ్యారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకూ వెయ్యి వాహనాలతో ర్యాలీగా వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శశికళ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమెలో కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ... కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం మరో 10 రోజులు ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే చెన్నైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

పరోక్షంగా చక్రం తిప్పే యోచనలో...

పరోక్షంగా చక్రం తిప్పే యోచనలో...

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. శశికళ జైలుకు వెళ్లేముందు ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టగా... ఇప్పుడాయనే ఆమెకు ఎదురు తిరుగుతున్నారు. శశికళను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రానిచ్చేది లేదని ఇటీవలే కుండబద్దలు కొట్టారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లినందునా... శశికళ నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. కాబట్టి పరోక్షంగానే ఆమె తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో ఉన్నారు.

కొద్దిరోజులుగా సన్నిహితులతో చర్చలు

కొద్దిరోజులుగా సన్నిహితులతో చర్చలు

ఇటీవల ఢిల్లీ వెళ్లిన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ అక్కడ బీజేపీ సీనియర్‌ నాయకుడు భూపేంద్ర యాదవ్‌తో రహస్యంగా చర్చలు జరిపారన్న ప్రచారం ఉంది. శశికళను నాలుగు రోజుల ముందే జైలు నుంచి విడుదల చేయించేందుకు ఆయన మంత్రాంగం సాగించినట్లు తెలుస్తోంది. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... శశికళ మాత్రం ఆ 4 రోజుల జైలు శిక్ష కూడా పూర్తయ్యాకే విడుదలవుతానని చెప్పారు. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ.. భవిష్యత్ కార్యాచరణపై టీటీవీ దినకరన్ సహా పలువురు నేతలతో కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నారు.

Recommended Video

  VK Sasikala Health Update: Doctors said that the condition of V.K. Sasikala is Stable For Now
  భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా?

  భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా?

  పలువురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు కూడా ఆమెతో టచ్‌లో ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆమె బీజేపీతో కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదు. శశికళ విడుదల తర్వాత అన్నాడీఎంకెపై ఆమె ఎఫెక్ట్ ఉంటుందా... తమిళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నది రాష్ట్రంలో ఇప్పుడు ఒకింత ఉత్కంఠ నెలకొంది.

  English summary
  Expelled All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) leader, VK Sasikala, will be released from Bengaluru’s Parappana Agrahara prison on Wednesday morning after serving a four-year jail term in the disproportionate assets case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X