Wife: ఫేస్ బుక్ లైవ్ లో భర్త ఆత్మహత్య, నా భార్య టార్చర్ పెట్టింది, నేను చస్తేనే ఆమె సుఖంగా ఉంటుంది!

చెన్నై/ తిరుప్పూర్: వివాహం చేసుకున్న దంపతులు మొదట సంతోషంగానే కాపురం చేశారు. భర్త దేవాలయాలకు శిల్పాలు చెక్కుతూ డబ్బు సంపాధిస్తూ అతని భార్యను పోషిస్తున్నాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు, చుట్టుపక్కల వారు అనేకసార్లు దంపతుల మద్య పంచాయితీలు చేశారు. భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అంటూ ఎవరిదారిలో వారు ఇంతకాలం నడిచారు. రెండు రోజుల క్రితం భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త మీద కేసు పెట్టింది.

పోలీసులు దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి నువ్వ నీ భార్యతో గొడవపడ్డావని తెలిస్తే బాగుండదని పోలీసులు భర్తకు వార్నింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన భర్త నువ్వు ఇంటికి వెళ్లు నేను తరువాత వస్తాను అని చెప్పి అతని భార్యను ఇంటికి పంపించేశాడు. నేరుగా నిర్జనప్రదేశంలోకి వెళ్లిన భర్త ఫేస్ బుక్ లైవ్ లో నా భార్య నన్ను టార్చర్ పెట్టిందని, ఆమెతో కలిసి నేను జీవించలేనని, నేను చనిపోతే ఆమె సంతోషంగా ఉంటుందని స్టోరీ మొత్తం చెప్పిన అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

శిల్పాలు చెక్కుతున్న యువకుడు

శిల్పాలు చెక్కుతున్న యువకుడు

తమిళనాడులోని కుంభకోణంకు చెందిన మణికందన్ అనే యువకుడు అతని 13 ఏళ్ల వయసులోనే తిరుప్పూర్ చేరుకుని అప్పటి నుంచి దేవాలయాలకు శిల్పాలు చెక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేస్తున్న మణికందన్ కు ప్రస్తుతం 27 సంవత్సరాలు. పెళ్లి వయసుకు వచ్చిన మణికందన్ వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు.

సంతోషంగా ఉన్నారు కానీ ?. తేడాలు వచ్చాయి

సంతోషంగా ఉన్నారు కానీ ?. తేడాలు వచ్చాయి

తమిళనాడులోని తారాపురం సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న మాలిని అనే యవతితో మూడు సంవత్సరాల క్రితం మణికందన్ వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మొదట్లో మణికందన్, మాలిని దంపతులు సంతోషంగానే కాపురం చేశారు. భర్త మణికందన్ దేవాలయాలకు శిల్పాలు చెక్కుతూ డబ్బు సంపాధిస్తూ అతని భార్య మాలినిని పోషిస్తున్నాడు. రానురాను మణికందన్, మాలిని దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

ఇంట్లో ఒకటే గొడవ

ఇంట్లో ఒకటే గొడవ

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో మణికందన్ కు పనిలేకుండాపోయింది. ఆ సమయంలో కుటుంబ పోషణకోసం మణికందన్ అప్పులు చేశాడు. అప్పులు చేసి కొన్ని నెలల పాటు భార్య మాలినిని పోషించిన మణికందన్ ఇప్పుడు పని చేస్తూ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాడు. సంపాధిస్తున్న డబ్బులో ఎక్కువగా వడ్డీలకు కడుతున్న మణికందన్ అతని భార్య మాలిని కోరికలు తీర్చలేకపోతున్నాడని తెలిసింది. ఇదే విషయంలో ఇంట్లో మణికందన్, మాలిని దంపతుల మద్య రామాయణం ఎక్కువ అయ్యింది.

అప్పులు ఇచ్చిన వాళ్లతో రామాయణం

అప్పులు ఇచ్చిన వాళ్లతో రామాయణం

ఈ మద్యకాలంలో మణికందన్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటి దగ్గరకు వెళ్లి అతన్ని, అతని భార్య మాలినిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. నిన్ను ఎవరు అప్పులు చెయ్యమన్నారు ?, వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి పరువు తీస్తున్నారు అంటూ మాలిని ఆమె భర్త మణికందన్ మీద చిందులు వెయ్యడం మొదలుపెట్టింది.

భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

అప్పులు చేసిన విషయంలో మణికందన్, మాలిని దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు, చుట్టుపక్కల వారు అనేకసార్లు మణికందన్, మాలిని దంపతుల మద్య పంచాయితీలు చేశారు. భర్త మణికందన్ ఎడ్డెం అంటే అతని భార్య మాలిని తెడ్డెం అంటూ ఎవరిదారిలో వారు ఇంతకాలం నడిచారు. రెండు రోజుల క్రితం మాలిని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త మణికందన్ మీద కేసు పెట్టింది.

వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

పోలీసులు మణికందన్, మాలిని దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి నువ్వ నీ భార్య మాలినితో గొడవపడ్డావని తెలిస్తే బాగుండదని పోలీసులు మణికందన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మణికందన్ నువ్వు ఇంటికి వెళ్లు నేను తరువాత వస్తాను అని చెప్పి అతని భార్య మాలినికి చెప్పి ఆమెను ఇంటికి పంపించేశాడు.

ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న భర్త

ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న భర్త

నిర్జనప్రదేశంలోకి వెళ్లిన మణికందన్ ఫేస్ బుక్ లైవ్ లో నా భార్య మాలిని నన్ను టార్చర్ పెట్టిందని, నా మీద పోలీసు కేసు పెట్టి నన్ను అవమానించిందని, ఆమెతో కలిసి నేను జీవించలేనని, నేను చనిపోతే ఆమె సంతోషంగా ఉంటుందని, నా అప్పులకు, నా భార్య మాలినకి ఎలాంటి సంబంధం లేదని జరిగిన స్టోరీ మొత్తం చెప్పిన అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

విషయం తెలుసుకున్న నల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మణికందన్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. భార్య మాలిని కేసు పెట్టడం వలనే అవమానంతో మణికందన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు మాలిని మీద ఆరోపణలు చేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది ఇప్పటికే అప్పులుపాలైన విషయం తెలిసిందే. అదే కరోనా వైరస్ కారణంగా అప్పులు చేసిన శిల్పాలు చెక్కే మణికందన్ ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+