డీఎంకె గెలిచినందుకు... నాలుక కోసి మొక్కు చెల్లించుకున్న మహిళా అభిమాని...
తమిళనాడులో డీఎంకె విజయం సాధించినందుకు ఆ పార్టీ మహిళా అభిమాని ఒకరు ఏకంగా తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె గెలిస్తే తన నాలుకను కోసి సమర్పిస్తానని ఆమె మొక్కుకున్నారు. ఎన్నికల్లో డీఎంకె గెలవడంతో మొక్కు చెల్లించుకున్నారు.
డీఎంకె గెలిచిందని తెలియగానే స్థానిక ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడే తన నాలుకను కోసుకున్నారు. అనంతరం దాన్ని అమ్మవారికి సమర్పించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఆలయంలో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో... ఆమె తన నాలుకను ఆలయ గేటు వద్దే పడేసి వెళ్లిపోయారు. అక్కడినుంచి ఆమె నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.
గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పశ్చిమ గోదావరికి చెందిన మహేష్ అనే ఆంధ్రా యువకుడు తన నాలుక కోసి దేవుడికి మొక్కు చెల్లించుకున్నాడు. నాలుకను కోసి దేవుడి హుండీలో వేశాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ యువకుడిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే... మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకె నేత్రుత్వంలోని కూటమి 159 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకె సొంతంగా 133 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 7 స్థానాల్లో,వీసీకే 4 స్థానాల్లో,సీపీఐ 2,సీపీఎం 2 స్థానాల్లో గెలుపొందాయి. అన్నాడీఎంకె-బీజేపీ కూటమి 75 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో అన్నాడీఎంకె 66 స్థానాల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది.
కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ సున్నా స్థానాలకు పరిమితమైంది. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ బీజేపీ అభ్యర్థి చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఓట్ల శాతం పరిశీలిస్తే.. డీఎంకెకి 37.7శాతం,అన్నాడీఎంకెకి 33.29శాతం,కాంగ్రెస్‌కు 4.26శాతం ఓట్లు వచ్చాయి.బీజేపీకి కేవలం 2.61శాతం ఓట్లు వచ్చాయి.ఇతరులకు 14.5శాతం,నోటాకు 0.01శాతం ఓట్లు వచ్చాయి.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications