ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కుప్పం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గా పునర్విభజన తరువాత ఇక్కడ పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. గతంలో ఉన్న మండలాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్న వి కోట మండలం పునర్విభజన తరువాత పలమనేరులో కలిసింది. ఇక, ఈ నియోజకవర్గం నుండి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరో సారి గెలుపొందారు. చంద్రగిరి నుండి ఒక సారి గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు...విభజన తరువాత ఏపి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా..పదేళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పని చేసారు. కుప్పం, పలమనేరు లో వచ్చిన మెజా ర్టీ తో నే టిడిపి ఎంపి శివప్రసాద్ ఎంపీగా గెలుపొందారు. టిడిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీ ఓడిపోని అతి కొద్ది నియోజక వర్గాల్లో కుప్పం ఒకటిగా నిలుస్తుంది.
13 సార్లు ఎన్నికలు..టిడిపి అధికంగా
కుప్పం నియోకవర్గంలో 1983 టిడిపి అవిర్భావం తరువాత ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఓడిపోలేదు. ఇది అరుదైన రికార్డు. ఇక, ఈ నియోజకవవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఎనిమిది సార్లు టిడిపి గెలిచిం ది. కాంగ్రెస్ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. చంద్రబాబు నాయుడు కంటే ముందు గా ఇక్కడ టిడిపి నుండి రంగస్వామి నాయుడు రెండు సార్లు గెలుపొందారు. చంద్రబాబు ఇక్కడి నుండి తొలి సారిగా 1989 లో గెలిచారు. అప్పటి నుండి ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూనే ఉన్నారు.

2014 ఎన్నికల్లో...
2014 ఎన్నికల్లో కుప్పం నియోజవర్గం లో మొత్తంగా 195887 ఓట్లు ఉండగా, అందులో 163576 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన చంద్రబాబు నాయుడుకు 102952 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన చంద్రమౌళికి 55831 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు 47121 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఏపి ముఖ్యమంత్రి అయ్యారు.












Click it and Unblock the Notifications