ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మదనపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామసముద్రం మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. 2009 లో రద్దు అయిన వాయల్పాడు నియోజకవర్గంలో నల్లారి అమరనాధరెడ్డి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఆయన మర్రి చెన్నారెడ్డి, అంజయ్య , భవనం క్యాబినెట్‌లో పని చేసారు. అమరనాధరెడ్డి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి వాయల్పాడు నుండి మూడు సార్లు, పీలేరు నుండి ఒకసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన సురేంద్ర రెడ్డి, రెండు సార్లు గెలిచిన రామచం ద్రారెడ్డిలు తండ్రి, కుమారులు. 1989,1999,2004 లో కిరణ్ ఇక్కడి నుండి గెలుపొందారు. ఇక, మదనపల్లె లో రాటకొండ కుంటు సభ్యులు ఎక్కువ సార్లు గెలుపొందారు.
14 సార్లు ఎన్నికలు..
మదనపల్లె నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి అయి దు సార్లు,సిపిఐ రెండు సార్లు, వైసిపి ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుండి దొడ్ల నరసింగరావు, రాటకొండ నారాయణ రెడ్డి లు రెండేసి సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ది గెలిచారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసిపి పార్టీ రాకతో అభ్యర్ధుల్లోనూ మార్పు జరిగింది.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు.,
2014 ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో మొత్తంగా241094ఓట్లు ఉండగా, అందులో 168411 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుం డి పోటీ చేసిన దేశాయ్ తిప్పారెడ్డికి 81252 ఓట్లు రాగా, టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి కేటాయించారు. బిజెపి నుండి పోటీ చేసిన నరసింహా రెడ్డికి 64663 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి తిప్పారెడ్డి 16589 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్దిగా గెలుపొందిన షాజహాన్ 2014 ఎన్నికల్లో ఇక్కడ అదే పార్టీ నుండి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో..
ఇక్కడి నుండి వచ్చే ఎన్నికల్లో వైసిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి తిరిగి పోటీ చేయటం ఖాయంగా కని పిస్తోంది. ఇక, గత ఎన్నికల్లో పొత్తులో బాగంగా ఈ నియోజకవర్గం బిజెపి కి కేటాయించారు. ఈ సారి టిడిపి అభ్యర్ధి గా ఎవరిని అధికారికంగా ఖరారు చేస్తారో చూడాల్సి ఉంది. ఇక, 2009 ఎన్నికల్లో మదనపల్లె నుండి ప్రజారాజ్యం అభ్యర్ధి గా చిన్నా వాసుదేవ రెడ్డికి 33167 ఓట్లు వచ్చాయి. ఈ సారి జనసేన ఇక్కడ నుండి ఎవరిని బరిలోకి దింపుతుందో ఇప్పటి వరకు స్పష్టత రాలేదుద. దీంతో..అభ్యర్ధులు అధికారికంగా ఖరారు చేసిన తరువాత పోటీ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications