ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ నుండి జ‌న‌ర‌ల్ గా మారింది. డీ లిమిటేష‌న్ త‌రు వాత అమ‌ర‌నాధ‌రెడ్డి పుంగ‌నూరు నుండి కాకుండా ప‌ల‌మ‌నేరు నుండి పోటీ చేసి గెలిచారు. పుంగ‌నూరు లో రెండు సార్లు, ఇక్క‌డ ఒక సారి గెలిచారు. ఆయ‌న తండ్రి రామ‌కృష్ణారెడ్డి పుంగ‌నూరులో మూడు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు చిత్తూ రు ఎంపీగా గెలుపొందారు. ఇక్క‌డ మూడు సార్లు టిడిపి నుండి గెలిచిన ప‌ట్నం సుబ్బ‌య్య కొంత కాలం చంద్ర‌బాబు ప్ర భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. 1952 లో జ‌న‌ర‌ల్ గా ఉన్న‌ప్పుడు గెలిచిన రామ‌బ్ర‌హ్మం ఆ త‌రువాత కుప్పంలో మ‌రో సారి గెలిచారు. ఇక‌, 2009 త‌రువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఇక్క‌డా ప్ర‌భావం చూపాయి.

13 సార్లు ఎన్నిక‌లు..
ప‌ల‌మ‌నేరు నియోక‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు గెలుపొందాయి. ఒక సారి స్వ‌తంత్ర పార్టీ, ఒక సారి వైసిపి గెలిచాయి. 2009 లో ఇక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్ధిగా గెలిచి న అమ‌ర‌నాధ‌రెడ్డి ఆ త‌రువాత కిర‌ణ్ కుమార రెడ్డికి వ్య‌తిరేకంగా ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి పార్టీ నిర్ణ‌యానికి వ్య తిరేకంగా ఓటు వేసి అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు. ఆ త‌రువాత వైసిపి లో చేరి 2014 ఎన్నిక‌ల్లో ప‌ల‌మ‌నేరు నియోక‌వ‌ర్గం నుండి పోటీ చేసారు.

#AndhraPradeshElections2019: All about Palamaner Constituency

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 231076 ఓట్లు ఉండ‌గా, అందులో 196500 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన అమ‌ర నాధ‌రెడ్డికి 96983 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన సుభాష్ చంద్ర‌బోస్ కు 93839 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన అమ‌ర‌నాధ‌రెడ్డి 3150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి నుండి గెలిచిన అమ‌ర‌నాధ రెడ్డి తిరిగి టిడిపి లోకి ఫిరాయించారు. ఆ త‌రువాత ఆయ‌న‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి ల‌భించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+