ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పుంగనూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. రొంపిచర్ల, సద్దం, పులిచర్ల, సో మ్ల మండలాలు పుంగనూరు నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడి నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో సారి గెలుపొందా రు. అంతకు ముందు పీలేరు లో మూడు సార్లు గెలిచారు. ఆయన వైయస్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకొని.. వైయస్ మరణం తరువాత రోశయ్య క్యాబినెట్‌లోనూ మంత్రిగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ విబేధాల కారణంగా పెద్దిరెడ్డి మంత్రి పదవి కోల్పోయారు. ఆ తరువాత ఆయన కిరణ్ ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వసానికి మద్దతుగా నిలిచి అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన కుమారుడు మిధున్ రెడ్డి 2014 లో రాజంపేట లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు.
16 సార్లు ఎన్నికలు జరిగితే..
పుంగనూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ తొమ్మది సార్లు, టిడిపి ఆరు సార్లు విజయం సాధించాయి. ఎన్ రామకృష్ణా రెడ్డి ఇక్కడ మూడు సార్లు గెలవగా, ఆయన కుమారుడు అమరనాధ రెడ్డి పుంగనూరులో రెండు సార్లు, పలమనేరు లో మరోసారి గెలిచారు. రామకృష్ణారెడ్డి చిత్తూరు లోక్‌సభ నుండి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక, 2009 లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 184254 ఓట్లు ఉన్నాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 104587 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన వెంకటరమణ రాజు కు 72856 ఓట్లు వ చ్చాయి. వైసిపి అభ్యర్ధి రామచంద్రారెడ్డి 31731 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ తో సన్నిహిత సం బంధాలతో పాటుగా పార్టీలో క్రియాశీలకంగా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తనయుడు మిధు న్ సైతం గత ఎన్నికల్లో వైసిపి నుండి గెలుపొంది..ఏపికి ప్రత్యేక హోదా కోసం ఎంపి పదవికి రాజీనామా చేసారు. ఇక, టిడిపి నుండి ఎవరు బరిలోకి దిగుతారనేది చూడాలి. గతంలో రెండు సార్లు వరుసగా పోటీ చేసి ఓడిన వ్యక్తికే తిరిగి సీటు ఇస్తారా లేక కొత్త వ్యక్తిని ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన ఖాదర్ బాషా కు 25891 ఓట్లు వచ్చాయి. మరి..ఈ సారి జనసేన ఇక్కడి పోటీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ ప్రధానంగా వైసిపి - టిడిపి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.












Click it and Unblock the Notifications