ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా..పూత‌ల‌ప‌ట్టు, ఐరాల‌, బంగారుపాళ్యం, త‌వ‌ణంప‌ల్లి, యాద‌మ‌ర్రి మండ‌లా లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. 2009 లో ఏర్పాటైన ఈ నియోజ‌క‌వ‌ర్గం లో ఒక‌సారి కాంగ్రెస్ ..మ‌రోసారి వైసిపి గెలిచాయి . అంత‌కు ముందు ఉన్న వేపంజ‌రి..పుత్తూరు నియోజ‌క‌వ‌ర్గాలు 2009 పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ర‌ద్ద‌య్యాయి. పుత్తూరు లో టిడిపి సీనియ‌ర్ నేత దివ‌గంత ముద్దు కృష్ణ‌మ నాయుడు అయిదు సార్లు గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు కావ‌టంతో 2009 లో న‌గరి నుండి పోటీ చేసారు. ఆయ‌న మిహాన మ‌రెవ‌రూ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండో సారి గెలుపొంద‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డివారి రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక‌సారి గెల‌వ‌గా, ఆయ‌న తండ్రి నాద‌ముని రెడ్డి రెండు సార్లు తిరుప‌తిలో గెలు పొందారు. ఇక, 2009 నుండి పూత‌ల ప‌ట్టు లో కొత్త స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌య్యాయి.

రెండు సార్లు ఎన్నిక‌లు..
2009 లో ర‌ద్ద‌య‌ని పుత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు సార్లు టిడిపి, నాలుగు సార్లు కాంగ్రెస్‌, సిపిఐ ఒక‌సారి, జ‌న‌తా పార్టీ ఒక‌సారి, కెఎల్‌పి ఒక సారి గెలుపొందాయి. ఇక‌, పూత‌ల ప‌ట్టు లో 2009 లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి గెలుపొందారు. అప్పుడు టిడిపి నుండి పోటీ చేసిన ల‌లిత కుమారి పై కాంగ్రెస్ నుండి పోటీ చేసిన డాక్ట‌ర్ ర‌వి గెలిచారు. ఆ త‌రువాత రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. వైసిపి ఏర్పాటు..రాష్ట్ర విభ‌జ‌న ప్ర‌భావం ఈ నియోక‌వ‌ర్గం పై ప‌డింది.

 Puthalapattu Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 199316 ఓట్లు ఉండ‌గా, అందులో 169868 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన సునీల్ కు 83200 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన ల‌లిత‌కుమారికి 82298 ఓట్లు వ‌చ్చాయి. ల‌లిత కుమారి వ‌రుస‌గా రెండో సారి ఓడిపోయారు. వైసిపి నుండి పోటీ చేసిన సునీల్ 902 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో..
ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి వైసిపి అభ్య‌ర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరిగి పోటీ చేయ‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, టిడిపి నుండి రెండు సార్లు ఓడిపోయిన ల‌లిత‌కుమారి తిరిగి పోటీ చేస్తారా లేదా అనే దాని పై స్ప‌ష్ట‌త లేదు. ఇక‌, 2209 లో ఇక్క‌డి నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా పోటీ చేసిన జ‌య‌రాం కు 17645 ఓట్లు ద‌క్కాయి. ఈ సారి జ‌న‌సేన పార్టీ ఇక్క‌డ బ‌రిలో దిగుతుందో లేదో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ఇక్క‌డి నుండి ఎవ‌రిని పార్టీ అభ్య‌ర్దిగా ప్ర‌క టిస్తార‌నేది తేలిన తరువాత పోటీ పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముఖ్య‌మంత్రి టిడిపి - వైసిపి మ‌ధ్యే ఇక్క‌డ కీల‌క పోటీ ఉండే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+